PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-tdp-peddireddi-minister-latest-newsc7f20fae-f419-470f-bac7-eef3cc268e56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-tdp-peddireddi-minister-latest-newsc7f20fae-f419-470f-bac7-eef3cc268e56-415x250-IndiaHerald.jpg తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో ఎదురులేకుండాఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెక్ పెట్టిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి జిల్లాలో వైసీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్నారు. జ‌‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు పొందేలా పెద్దిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించారు. ycp, jagan, tdp, peddireddi, minister, latest news;view;kiran;simhaa;tiru;telugu desam party;roja;mp;district;telugu;chittoor;tirupati;chittor;mla;minister;husband;wife;cheque;local language;ycp;chandragiri;punganur;reddy;madanapalle;nagari;partyచూడ‌ప్పా.. రెడ్డ‌ప్పా.. నేను సింహం లాంటోణ్ని.. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌చూడ‌ప్పా.. రెడ్డ‌ప్పా.. నేను సింహం లాంటోణ్ని.. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌ycp, jagan, tdp, peddireddi, minister, latest news;view;kiran;simhaa;tiru;telugu desam party;roja;mp;district;telugu;chittoor;tirupati;chittor;mla;minister;husband;wife;cheque;local language;ycp;chandragiri;punganur;reddy;madanapalle;nagari;partyFri, 02 Apr 2021 16:10:26 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి సొంత జిల్లా చిత్తూరులో ఎదురులేకుండాఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెక్ పెట్టిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్ర‌రెడ్డి జిల్లాలో వైసీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్నారు. జ‌‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు పొందేలా పెద్దిరెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించారు. కానీ ప‌ద‌వుల ఎంపిక ద‌గ్గ‌ర ముఖ్య‌మంత్రి పెద్దిరెడ్డికి చెక్ పెట్టారు. ఆయ‌న ఒక‌పేరు చెబితే సీఎం మ‌రొక‌రికి ప‌ద‌విచ్చారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డిని జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా బ‌ల‌హీన‌ప‌రుస్తున్నార‌నే వార్త‌లు షికారు చేస్తున్నాయి.

మాట చెల్లుబాటు కాలేదు
పుర‌పాల‌క సంఘాలు, కార్పొరేష‌న్ ప‌దవుల‌ ఎన్నికల్లో పెద్దిరెడ్డి మాట చెల్లుబాటు కాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో ఆయన వర్గంగా చెప్పుకునేవారికి పదవులు దక్కలేదు. ఒక్క పుంగనూరులోనే దక్కింది. చిత్తూరు మేయర్ ఎంపికలో పెద్దిరెడ్డి వర్గీయుల‌నుకాద‌ని,‌ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బలపరిచిన ఆముదను మేయర్ పదవికి ఎంపికచేశారు.

ఎమ్మెల్యేల మాటే నెగ్గింది
మదనపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి, ఆయ‌న కుమారుడు, ఎంపీ మిధున్రెడ్డి ప్రధాన అనుచరుడు జింకా‌ చలపతి భార్య రాధమ్మను చైర్పర్సన్‌గా ఎంపిక చేస్తారని భావించారు. అయితే మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా స్నేహితుడు కిరణ్ రెడ్డి భార్యకు చైర్ పర్సన్ పదవి దక్కింది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజా చ‌క్రం తిప్పి పెద్దిరెడ్డి వ‌ర్గానికి ప‌ద‌వులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. తిరుపతి కార్పొరేషన్, పలమనేరు, పుత్తూరు మున్సిపాలిటీల్లోనూ ఎమ్మెల్యేలు తమ వర్గాలకే పదవులు దక్కించుకున్నారు.ఈ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నించిన వారికి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా తగ్గించేందుకు నగరి, మదనపల్లె, తిరుపతి, చంద్రగిరి, చిత్తూరు ఎమ్మెల్యేలు ఉమ్మ‌డిగా చ‌క్రం తిప్పారంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు అధిష్టానం దగ్గర కూడా పెద్దిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోతోందనే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీటిల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే!!.



ట్రోలర్స్ పై ఫైర్ అయిన యువ సంగీత దర్శకుడు...?

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...

తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?

తుమ్మల ఆలోచన ఏ విధంగా ఉంది...?

వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ అన్ని క్యాన్సల్ అంట...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>