PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_tvnews/evm machines videosasasa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_tvnews/evm machines videosasasa-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్‌, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. అయితే అసోంలో ఓ బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంలు లభించినట్టు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తర్‌కండి బీజేపీ అభ్యర్థి క్రిష్ణేందు పాల్ కారులో ఈవీఎంలను చూపిస్తున్న వీడియోను స్థానిక జర్నలిస్టు అతాను భుయాన్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అసోంలో రassam;priya;priyanka;bharatiya janata party;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;car;assembly;local language;central government;partyబీజేపీ నేత కారులో ఈవీఎంలు... అసోంలో రాజ‌కీయ ర‌చ్చ‌..బీజేపీ నేత కారులో ఈవీఎంలు... అసోంలో రాజ‌కీయ ర‌చ్చ‌..assam;priya;priyanka;bharatiya janata party;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;car;assembly;local language;central government;partyFri, 02 Apr 2021 09:56:51 GMTపశ్చిమ బెంగాల్‌, అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. అయితే అసోంలో ఓ బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంలు లభించినట్టు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పత్తర్‌కండి బీజేపీ అభ్యర్థి క్రిష్ణేందు పాల్ కారులో ఈవీఎంలను చూపిస్తున్న వీడియోను స్థానిక జర్నలిస్టు అతాను భుయాన్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అసోంలో రెండో దశ ఎన్నికలు జరిగిన తర్వాతి రోజే ఈ వీడియో కలకలం రేగడం గమనార్హం.


కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం 7 గంటల వరకూ పశ్చిమ బెంగాల్‌లో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74.79శాతం పోలైనట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. భారతీయ జనతా పార్టీ , తృణమూల్‌ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరగగా సాయంత్రం 7గంటల వరకు 80.43శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
 

అసోంలో రెండో విడతలో 39 స్థానాలకు   పోలింగ్ జ‌రిగింది.  రెండో విడతలో 394 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనుండగా.. 73,44,631 మంది ఓటు వేయనున్నారు. 13 జిల్లాల పరిధిలో పోలింగ్ జరిగింది. 34 స్థానాల్లో బీజేపీ, 24 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్‌ కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు. 310 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించ‌డం గ‌మ‌నార్హం.






కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపి దగ్గర చేసుకోలేకపోతుందా...?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>