AutoGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedతాను క‌ల క‌నలేదు. కానీ ఎదుటివారి క‌ష్టాన్ని చూశాడు.. త‌న క‌ష్టంగా భావించాడు. అది తీరాల‌ని క‌ల క‌న్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతే.. రాజ‌స్తాన్‌కి చెందిన 19 సంవ‌త్స‌రాల యువ రైతు యోగేష్‌. ట్రాక్టర్ నడపడం చాలా కష్టం. వెనకాల ట్రాలీ ఉంటే మరింత జాగ్రత్తగా నడపాలి. డ్రైవ‌ర్‌తో సంబంధం లేకుండా అదే నడిస్తే రైతుకు అంత కంటే ఆనందం ఏముంటుంది? పొలంలో దుక్కి దున్నేటప్పుడు రైతులకు నడుము నొప్పి వ‌స్తుంటుంది. ఇది శతాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య. inspiration, latest news, auto;adah sharma;yogesh;driver;local language;yuva;father;research and analysis wingనాన్న‌కు ఆరోగ్యం బాలేదు.. వెంట‌నే బ‌య‌లుదేరి రా!!నాన్న‌కు ఆరోగ్యం బాలేదు.. వెంట‌నే బ‌య‌లుదేరి రా!!inspiration, latest news, auto;adah sharma;yogesh;driver;local language;yuva;father;research and analysis wingFri, 02 Apr 2021 08:01:00 GMTతాను క‌ల క‌నలేదు. కానీ ఎదుటివారి క‌ష్టాన్ని చూశాడు.. త‌న క‌ష్టంగా భావించాడు. అది తీరాల‌ని క‌ల క‌న్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అతే.. రాజ‌స్తాన్‌కి చెందిన 19 సంవ‌త్స‌రాల యువ రైతు యోగేష్‌. ట్రాక్టర్ నడపడం చాలా కష్టం. వెనకాల ట్రాలీ ఉంటే మరింత జాగ్రత్తగా నడపాలి. డ్రైవ‌ర్‌తో సంబంధం లేకుండా అదే నడిస్తే  రైతుకు అంత కంటే ఆనందం ఏముంటుంది? పొలంలో దుక్కి దున్నేటప్పుడు రైతులకు నడుము నొప్పి వ‌స్తుంటుంది. ఇది శతాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి న‌డుం బిగించాడు.. యోగేష్‌

డ్రైవ‌ర్ లేకుండా ట్రాక్ట‌ర్ ఉండొచ్చుగా!
బీఎస్సీ మొద‌టి సంవ‌త్స‌రం చదువుతున్న యోగేష్‌కి  ఓ రోజు ఫోన్‌ వచ్చింది. "నాన్నకు ఆరోగ్యం బాగోలేదు... అర్జెంటుగా నువ్వు ఊరికి రా" అన్నారు. హడావుడిగా వెళ్లాడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ... మరోవైపు పొలం పనులు చెయ్యాల్సి వచ్చింది. దాదాపు 2 నెలలలు ట్రాక్ట‌ర్‌తో పనులు చేశాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన త‌ట్టింది మనం డ్రైవర్ లేకుండా న‌డిచే కార్ల‌ను చూస్తున్నాం.. డ్రైవ‌ర్ లేని ట్రాక్టర్ ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. అలా రిమోట్ కంట్రోల్‌తో నడిచే ట్రాక్టర్‌ను త‌యారుచేశాడు.

రూ.2వేల ప్ర‌యోగం ప్రారంభం
రూ.2వేల‌తో యోగేష్ ప్రయోగం ప్రారంభించాడు. తన ఉద్దేశాన్ని యోగేష్ తండ్రికి చెప్పినప్పుడు ఆయ‌న సరే అంటూ రూ.2వేలు ఇచ్చారు. ఎలా ప‌నిచేస్తుందో ముందు నాకు చూపించు అని యోగేష్ తండ్రే కోర‌డంతో ఆ డ‌బ్బుతో కొన్ని ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేశాడు. రిమోట్‌తో ట్రాక్టర్ను క‌దిలించి చూపించాడు. కొడుకు చెప్పింది సాధ్య‌మ‌వుతుంద‌ని న‌మ్మ‌కం క‌లిగిన తండ్రి బంధువుల దగ్గర రూ.50,000 అప్పు చేసి ఇచ్చారు. దాంతో యోగేష్ తన కల నిజమ‌య్యేలా పూర్తి స్థాయి పరికరాలతో మంచి రిమోట్ కంట్రోల్ తయారుచేసుకొని ట్రాక్ట‌ర్‌ను డ్రైవ‌ర్ లేకుండా పూర్తిగా న‌డిపించి చూపించాడు. డ‌బ్బు, స‌మ‌యం ఆదా అవ‌డంతోపాటు అనారోగ్య స‌మ‌స్య‌ల్ని దూరం చేస్తుండ‌టంతో ఈ ట్రాక్ట‌ర్ని చూసిన స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన రైతులు కూడా త‌మ ట్రాక్ట‌ర్‌ను రిమోట్‌తో న‌డిపేలా చేయ‌మంటూ కోర‌డంతో యోగేష్ బిజీ అయ్యాడు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయ‌డానికి ఇది త‌న‌కు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వ‌డంతోపాటు స్ఫూర్తిని నింపుతుందంటున్నాడు.






ఏపీలో క‌రోనా రాకాసి విజృంభ‌ణ‌... వామ్మో ఇన్ని కొత్త కేసులా

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?

హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

తిరుపతి భయంతోనే వెనకడుగు వేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>