Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgనగరానికి ఏమైంది చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ తరువాత తను నటించే సినిమాకు తానే దర్శకత్వం వహించి "ఫలక్‌నుమా దాస్‌" చిత్రం ద్వారా ప్రేక్షకులకు దగ్గరై, హిట్ సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో తాజాగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకviswak sane;naresh;allari naresh;nivetha pethuraj;raj;roja;cinema;love;interview;hero;traffic police;romantic;viswak sen;yatra;love story;chitramహిట్ 2 విశ్వక్ సేన్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?హిట్ 2 విశ్వక్ సేన్ చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?viswak sane;naresh;allari naresh;nivetha pethuraj;raj;roja;cinema;love;interview;hero;traffic police;romantic;viswak sen;yatra;love story;chitramFri, 02 Apr 2021 09:00:00 GMTనగరానికి ఏమైంది చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ తరువాత తను నటించే సినిమాకు తానే దర్శకత్వం వహించి "ఫలక్‌నుమా దాస్‌" చిత్రం ద్వారా ప్రేక్షకులకు దగ్గరై, హిట్ సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో తాజాగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే  హీరో ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రథయాత్ర చేపడుతున్నట్లు హీరో తెలిపారు. ఈ రథయాత్రలో భాగంగా 1600 రోజా పూలు తమ అభిమానులకు పంచడం ఈ యాత్ర ప్రత్యేకత అంటూ విశ్వక్ తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్వక్ ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన హిట్ చిత్రం ఏ స్థాయిలో విజయవంతమైనదో మనకు తెలిసినదే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 చిత్రంలో
విశ్వక్ నటించక పోవడం గమనార్హం.

ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ..ఎంతో విజయం సాధించిన హిట్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న హిట్ 2 చిత్రంలో నటించక పోవడం ఎంతో బాధగా ఉంది. అయితే ఇతర సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ సినిమాను వదులుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూడు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న విశ్వక్ తాను దర్శకత్వం వహించి, నటించిన ఫలక్‌నుమా దాస్‌ చిత్రాన్ని సీక్వెల్ గా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే తాజాగా విశ్వక్ నటిస్తున్న "పాగల్" చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా నివేదా పేతురాజ్ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో విశ్వక్ ,నివేదా మధ్య లిప్ లాక్ సీన్ లు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన స్టిల్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాగల్ సినిమా విజయంపై హీరో, చిత్ర బృందం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది


అమానుష ఘటన : మామిడి పళ్ళు దొంగిలించారని.. ఆ చిన్నారులను దారుణంగా..?

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌తో మాన‌సిక స‌మ‌స్య‌లు?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>