PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-11-states-red-alert6e78b3f9-52c2-4f5d-8f30-521ecc8fa5df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid19-11-states-red-alert6e78b3f9-52c2-4f5d-8f30-521ecc8fa5df-415x250-IndiaHerald.jpgకేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది.COVID19 11 STATES RED ALERT;amala akkineni;rajeev;maharashtra - mumbai;uddhav thackeray;chief minister;cabinet;maharashtra;central government;coronavirus;panjaa11 రాష్ట్రాలు యమ డేంజర్.. దేశంలో కరోనా పంజా11 రాష్ట్రాలు యమ డేంజర్.. దేశంలో కరోనా పంజాCOVID19 11 STATES RED ALERT;amala akkineni;rajeev;maharashtra - mumbai;uddhav thackeray;chief minister;cabinet;maharashtra;central government;coronavirus;panjaaFri, 02 Apr 2021 19:43:50 GMTకేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.11 రాష్ట్రాల్లో ‘తీవ్రమైన ఆందోళనకర పరిస్థితులు’ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 14 రోజులలో ఈ రాష్ట్రాల నుంచి 90 శాతం కేసులు వచ్చాయని పేర్కొంది. గత కరోనా దశ కంటే ఈసారి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

మహారాష్ట్రలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు రాజీవ్ గౌబా. మహారాష్ట్ర విషయంలో మాత్రం తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కోవిడ్ కేసుల విషయంలో తక్షణమే మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కోవిడ్‌ను అరికట్టడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని వనరులనూ ఉయోగించాలని, ఆరోగ్య శాఖే కాదు, ఇందుకు అన్ని శాఖలూ ప్రభుత్వాలకు సహకరించాలని రాజీవ్ గౌబా విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధికారులతో  సమావేశమయ్యారు. ఇందులో రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న వైరస్  కారణంగా పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహారాష్ట్రలో మరిన్ని ఆంక్షల విధించే అవకాశం ఉందని సమాచారం. , పూణె జిల్లాలో శనివారం  నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నైట్ కర్ఫ్యూ అమలు చేయక తప్పదని అధికారులు తెలిపారు.  బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను ఏడు రోజులపాటు మూసివేయనున్నట్టు పూణె డివిజనల్ కమిషనర్ తెలిపారు. అలాగే ప్రార్థనా స్థలాలను వారం రోజులపాటు పూర్తిగా మూసియనున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.  


న‌ల్గొండ జిల్లాలో ఘోరం

తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు..?

వైజాగ్ లో ఆటిజం థెరపీ సెంటర్ ని ప్రారంభించిన పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్..!!

కేంద్ర మంత్రులకు మోడీ షాక్...?

వైల్డ్ డాగ్ కి నాగార్జున చేసిన ప్రమోషన్స్ ఫలించాయా?? టాక్ ఎలా ఉంది ??

సాగర్ లో బీజేపీ ఓటమి ఫిక్సయిందా ఆ ఏడుపు దేనికి సంకేతం ?

ఆంధ్రప్రదేశ్ లో పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ తొలి ఆటిజం కేంద్రం ఏర్పాటు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>