MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-wild-dog-ott-release-business-close3e3712be-29be-434a-88af-b8843e34c11f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-wild-dog-ott-release-business-close3e3712be-29be-434a-88af-b8843e34c11f-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగార్జున హీరోగా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్.. అహిషోర్ సాలొమోన్ దర్శకుడు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకులముందుకు వచ్చింది.. ఫస్ట్ లుక్ దగ్గరినుంచి ట్రైలర్ వరకు ఈ సినిమా అన్ని రకాలుగా ఆకట్టుకోగా మంచి అంచనాలు ఏర్పరుచుకుందిnagarjuna;nagarjuna akkineni;ram gopal varma;vijay varma;geetha;nageshwara rao akkineni;saiyami kher;thaman s;vijay;hyderabad;india;nepal;cinema;sangeetha;joseph vijay;research and analysis wingవైల్డ్ డాగ్ రివ్యూ..!!వైల్డ్ డాగ్ రివ్యూ..!!nagarjuna;nagarjuna akkineni;ram gopal varma;vijay varma;geetha;nageshwara rao akkineni;saiyami kher;thaman s;vijay;hyderabad;india;nepal;cinema;sangeetha;joseph vijay;research and analysis wingFri, 02 Apr 2021 14:26:07 GMTఅక్కినేని నాగార్జున హీరోగా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్.. అహిషోర్ సాలొమోన్ దర్శకుడు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకులముందుకు వచ్చింది.. ఫస్ట్ లుక్ దగ్గరినుంచి ట్రైలర్ వరకు ఈ సినిమా అన్ని రకాలుగా ఆకట్టుకోగా మంచి అంచనాలు ఏర్పరుచుకుంది.. నాగార్జున కెరీర్ లోనే వెరైటీ సినిమాగా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం..

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ (నాగార్జున) ఎన్ ఐఏ ఆఫీసర్.. ఈయనకు వైల్డ్ డాగ్ అనే పేరుంది. హైదరాబాద్ లోని గోకుల్ చాట్ లో పేలుడు, ఆ తర్వాత దేశంలో పలుచోట్ల జరిగే బాంబు దాడులకు కారణమైన టెర్రరిస్ట్ ను పట్టుకోవడానికి విజయ్ వర్మ అండ్ అతని టీం ఎలాంటి ప్రయత్నాలు చేసింది. చివరికి ఆ ఉగ్రవాది నేపాల్ పారిపోయాడు. ఈ క్రమంలో విజయ్ వర్మ ఈ ఉగ్రవాదిని నేపాల్ నుండి ఎలా ఇండియా కి తీసుకొచ్చారు అనేదే సినిమా కథ..

వైల్డ్ డాగ్ పక్కా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ సినిమా.. వైల్డ్ డాగ్ సినిమా నాగార్జున వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎప్పటిలాగే తన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. నాగ్ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా మారిపోయింది. నాగ్ టీంలోని నటులు కూడా ఆకట్టుకున్నారు. నేపాల్ లో రా ఏజెంట్ గా నటించిన సయామీ ఖేర్ ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ లో తన పెర్ఫార్మన్స్ బాగుంది. దియామీర్జా నటన పర్వాలేదు. ఖాలిద్ పాత్రలో చేసిన నటుడు మంచి హవాభావాలు పలికించాడు.  దర్శకుడు మంచి కథ ను తీసుకున్నాడు. కథ కు తగ్గట్లే ట్రీట్మెంట్ కూడా అదిరిపోయింది. ఎంత పెద్ద కాంప్లికేట్ సీన్ ను అయినా సింపుల్ గా హ్యాండిల్ చేశాడు. తమన్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.. అసలు మ్యూజిక్ ఇచ్చింది తమనేనా అన్నట్లు ఉంది. ఎడిటింగ్, సినిమా టోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి..

ప్లస్ పాయింట్స్ :
నాగార్జున
యాక్షన్ సీన్స్
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్ :
కథనం
ఫస్ట్ హాఫ్
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

తీర్పు :
దర్శకుడు ఫస్ట్ హాఫ్ పైన కొంత వర్క్ చేసి ఉంటే బాగుండేది.. సెకండ్ హాఫ్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో లేవు.. నాగార్జున సాహస ఘట్టాలు బాగున్నాయి. టీం పెర్ఫార్మన్స్ బాగుంది.  ఓవరాల్ గా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది..

రేటింగ్ : 2.5 /5



వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>