PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహించిన అఖిలపక్షం సమావేశాన్ని బహిష్కరించినన జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నేత పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్ వేసిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన పరిషత్ ఎన్నికలపై కోర్టులో వాయిదా ఉంది అని చెప్పుకొచ్చారు. ఆ పిటిషన్ లో ఎన్నికల సంఘం కూడా సమాధానం చెప్పాల్సి ఉంది అని ఆయన డిమాండ్ చేసారు. ఈ నెల 7వ తేదీన కోర్టు లో వాయిదా ఉంటే 8వ తేదీన ఎన్నికలు నిర్వహాస్తున్నట్లు ఎన్నికల సంఘం ఎలా ప్రకjansena,ap;mahesh;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;high court;tirupati;court;husband;letter;janasena party;partyఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేనఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేనjansena,ap;mahesh;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;janasena;high court;tirupati;court;husband;letter;janasena party;partyFri, 02 Apr 2021 13:04:30 GMTరాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహించిన అఖిలపక్షం సమావేశాన్ని బహిష్కరించినన జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నేత పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్ వేసిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన పరిషత్ ఎన్నికలపై కోర్టులో వాయిదా ఉంది అని చెప్పుకొచ్చారు. ఆ పిటిషన్ లో ఎన్నికల సంఘం కూడా సమాధానం చెప్పాల్సి ఉంది అని ఆయన డిమాండ్ చేసారు. ఈ నెల 7వ తేదీన కోర్టు లో వాయిదా ఉంటే 8వ తేదీన ఎన్నికలు నిర్వహాస్తున్నట్లు ఎన్నికల సంఘం ఎలా ప్రకటించింది నిలదీశారు.

ఇది అప్రజాస్వామికమని జనసేన భావిస్తోంది అని ఆయన అన్నారు. ఏప్రిల్ 1 వ తేదీన రాజకీయ పార్టీలు ఆహ్వానించి రాత్రికి నోటిఫికేషన్ ఇచ్చి అందరిని ఏప్రిల్ పూల్ చేశారు అని వెల్లడించారు. కోర్టులో తీర్పు కూడా రాకుండా మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే నాయస్థానంపై గౌరవం లేదా అని నిలదీశారు. 7వ తేదీన తీర్పు ఎలా వస్తుందో వేచిచూడాలి అని, తిరుపతి ఎన్నికలను గందరగోళపరిచే క్రమంలోనే పరిషత్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల అని మండిపడ్డారు.

ఇక బిజెపి నేతలు కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి అధికార ప్రతినిధి వాక సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ స్వత్రంత్రంగా వ్యవహారించడం లేదు అని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణపై ముందే నిర్ణయం తీసుకొని సమావేశానికి హాజరు కావాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జగన్ ఎన్నికల కమిషన్ గా పని చేస్తోంది అని విమర్శించారు. ఎన్నికల కమిషన్ నియామకమే లోపభూయిష్టంగా ఉంది అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందే షెడ్యూల్ ను ప్రకటిస్తే అందుకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేస్తారా అని నిలదీసారు.



ముఖంపై నల్లటి మచ్చలా.. పోవాలంటే ఇలా చేయండి..?

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు

హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>