MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/hero-nani-tuck-jagadish-jersey-tollywood-9288cca9-ac42-42c0-aa3d-4d01d74564f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/hero-nani-tuck-jagadish-jersey-tollywood-9288cca9-ac42-42c0-aa3d-4d01d74564f0-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో నాని ఓ మంచి నటుడు, ఎవరూ వంకపెట్టలేరు. ఇటీవలే నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి జాతీయ పురస్కారం కూడా లభించింది. అయితే నాని ఇప్పుడు కమర్షయల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో నాని హీరోగా నటించి బాక్సాఫీస్ కొల్లగొట్టిన సినిమా ఒక్కటీ లేదు. అయినా నాని మూవీస్ అంటే కచ్చితంగా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఆ పేరు నిలబెట్టుకోవాలంటే మాత్రం అర్జంట్ గా ఈ యువహీరోకి ఓ హిట్ కావాలి. అందుకే టక్ జగదీష్ సక్సెస్ పై అంతగా గాభరా పడుతున్నారు నాని. hero nani, tuck jagadish, jersey, tollywood,;nani;shiva;siva nirvana;visakhapatnam;cinema;vishakapatnam;jersey;event;lord siva;hero;success;kusuma jagadish;shiva nirvana;gang leader;leader;tuck jagdish;v;tuck jagadishహీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?హీరో నాని మరీ అంత కష్టాల్లో ఉన్నారా..?hero nani, tuck jagadish, jersey, tollywood,;nani;shiva;siva nirvana;visakhapatnam;cinema;vishakapatnam;jersey;event;lord siva;hero;success;kusuma jagadish;shiva nirvana;gang leader;leader;tuck jagdish;v;tuck jagadishFri, 02 Apr 2021 11:00:00 GMTనాని ఓ మంచి నటుడు, ఎవరూ వంకపెట్టలేరు. ఇటీవలే నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి జాతీయ పురస్కారం కూడా లభించింది. అయితే నాని ఇప్పుడు కమర్షయల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో నాని హీరోగా నటించి బాక్సాఫీస్ కొల్లగొట్టిన సినిమా ఒక్కటీ లేదు. అయినా నాని మూవీస్ అంటే కచ్చితంగా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. ఆ పేరు నిలబెట్టుకోవాలంటే మాత్రం అర్జంట్ గా ఈ యువహీరోకి ఓ హిట్ కావాలి. అందుకే టక్ జగదీష్ సక్సెస్ పై అంతగా గాభరా పడుతున్నారు నాని.

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదలైన 'వి' సినిమా, అంతకు ముందు థియేటర్లలోకి వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ.. ఏదీ కలసి రాకపోవడంతో నాని కొత్త సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. నిన్నుకోరి సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరోసారి నాని చేసిన సినిమా టక్ జగదీష్. ఈనెల 23న విడుదలవుతున్న టక్ జగదీష్ మూవీ నాని కెరీర్ కి చాలా ముఖ్యంగా మారింది.

విడుదలకు ఇంకా టైమ్ ఉన్నా కూడా.. ప్రమోషన్ కార్యక్రమాలను మాత్రం ఓ రేంజ్ లో మొదలు పెట్టాడు టక్ జగదీష్. ఇటీవలే హీరో పరిచయ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత ప్రత్యేకంగా మీడియాతో చిత్ర యూనిట్ ముచ్చటించింది. నటుడిగా తనకెంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇదని చెబుతున్నారు నాని. ఏప్రిల్ 13న ట్రైలర్ లాంచ్ కోసం కూడా వైజాగ్ లో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

సహజంగా లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న సినిమాల సక్సెస్ విషయంలో నటీనటులంతా చాలా టెన్షన్లో ఉంటున్నారు. అసలే థియేటర్లకు జనాల రాక తక్కువగా ఉంది, ఈ దశలో ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా.. ఆన్ లైన్లో సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. సినిమా సూపర్ హిట్, అందులోనూ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అనిపిస్తేనే.. హాల్ వరకు వస్తున్నారు. ఇప్పుడు టక్ జగదీష్ విజయంపై కూడా నాని అందుకే ఆందోళనలో ఉన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా నానికి అవకాశాలు వస్తాయి. అయితే వరుస ఫ్లాపులు పడితే మాత్రం కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్టే లెక్క. టక్ జగదీష్ తో ఫ్లాప్ ట్రాక్ నుంచి బయటపడాలనుకుంటున్నారు నాని.


టీడీపీ,బీజేపీ, జనసేన పార్టీలు సాహ్ని సమావేశానికి డుమ్మా..!!

అమలతో కలిసి నటించిన సినిమాలెన్నో చెప్పలేకపోయిన నాగార్జున..!

రవితేజ ఇడియట్ సినిమా ఎన్ని కోట్లు వసూల్ చేసిందో మీకు తెలుసా..?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>