CrimeSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime2bffdb82-93fd-4f42-846b-523a85299cfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime2bffdb82-93fd-4f42-846b-523a85299cfc-415x250-IndiaHerald.jpgఓ యువకుడు అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె జీవితం, ఆమె సర్వస్వము అనుకున్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని ఏన్నో కలలు కన్నాడు. కానీ ఇరు కుటుంబాల్లోనూ వీళ్ల ప్రేమ విషయం తెలిసి రచ్చ రచ్చ అయింది. ఊళ్లో పంచాయితీ కూడా పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని పంచాయితీ పెద్దలు తీర్పునివ్వడంతో మనస్తాపం చెందాడు. తమ పెళ్లి ఇక జరగదేమోనన్న నిర్ణయానికి వచ్చేశాడు. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.crime;kumaar;jeevitha rajaseskhar;prema;smart phone;police;marriage;love;father;arundhati;siddipet;racchaప్రియుడు చేసిన నిర్వాకానికి బిత్తరపోయిన యువతి.. చివరకు..!ప్రియుడు చేసిన నిర్వాకానికి బిత్తరపోయిన యువతి.. చివరకు..!crime;kumaar;jeevitha rajaseskhar;prema;smart phone;police;marriage;love;father;arundhati;siddipet;racchaFri, 02 Apr 2021 10:00:00 GMTఓ యువకుడు అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె జీవితం, ఆమె సర్వస్వము అనుకున్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని ఏన్నో కలలు కన్నాడు. కానీ ఇరు కుటుంబాల్లోనూ వీళ్ల ప్రేమ విషయం తెలిసి రచ్చ రచ్చ అయింది. ఊళ్లో పంచాయితీ కూడా పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని పంచాయితీ పెద్దలు తీర్పునివ్వడంతో మనస్తాపం చెందాడు. తమ పెళ్లి ఇక జరగదేమోనన్న నిర్ణయానికి వచ్చేశాడు. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట హౌసింగ్ బోర్డు పరిధిలోని అరుంధతి కాలనీకి చెందిన 25 ఏళ్ల మనోజ్ కుమార్ ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్నాడు. సిద్దిపేట సిటీకి దగ్గరలోనే ఉండే ఓ గ్రామానికి చెందిన యువతిని మనోజ్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరి ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాల్లోనూ తెలిసింది. దీంతో రచ్చ రచ్చ అయింది. పంచాయితీ జరిగింది. చివరకు ఆ యువతితో దూరంగా ఉండాలని పంచాయితీ పెద్దలు తీర్పునిచ్చారు. ఆ తీర్పు పట్ల మనోజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ప్రేయసి లేని జీవితం తనకు అక్కర్లేదనుకున్నాడు.

అయితే బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి బోజనం చేశాడు. ఆ తర్వాత పై అంతస్తులో ఉండే తన గదికి వెళ్లాడు. అక్కడే ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తుంటాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతికి మనోజ్ వీడియో కాల్ చేశాడు. ‘నువ్వు లేకుండా నేను బతకలేను. నీతో మాట్లాడకుండా ఉండలేను. చివరి సారిగా నిన్ను కళ్లారా చూసుకుందామనే ఫోన్ చేశా. బై బంగారం. జాగ్రత్త‘ అంటూ చివరి సారిగా మాట్లాడి ప్రేయసి చూస్తుండగానే బ్లేడుతో చేతి మణికట్టు, గొంతు కోసుకున్నాడు.

దీంతో వెంటనే అప్రమత్తమయిన ఆ యువతి, అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వాళ్లు వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. గురువారం యువకుడి తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



కమ్మ సామాజిక వర్గాన్ని బిజెపి దగ్గర చేసుకోలేకపోతుందా...?

వైసీపీలో అవినాష్ వెరీ వెరీ స్పెష‌ల్‌..!

జగన్, కేసీఆర్.. ఈ రాజస్థాన్‌ నిర్ణయం చూశారా.. మీరూ చేస్తారా..!

అనుష్క కండిషన్స్ కు షాక్ లో నవీన్ పోలి శెట్టి !

వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... నాగ్‌కు ఈ టార్గెట్ క‌ష్ట‌మేనా..!

నీలం సాహ్నికి తొలి రోజే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాక్‌

టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ లో సత్తా చాటుకున్న సినిమాలివే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>