PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-new-high-court-issue407a0df8-908e-44c4-b9a1-3c87f38e89b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-new-high-court-issue407a0df8-908e-44c4-b9a1-3c87f38e89b1-415x250-IndiaHerald.jpgఏపీలో మళ్ళీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు ప్రతి పక్ష టీడీపీతో పాటు కొని వైసీపీ వ్యతిరేఖ పార్టీలు మూడు రాజధానుల అంశానికి అడ్డు తగులుతుంటే...వైసీపీ మాత్రం ఖచ్చితంగా రాజధాని వికేంద్రీకరణ చేసి తీరుతాం అంటూ ఆ వ్యవహారాల్లో ముందుకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రలో అధికారంలో ఉన్న ఎన్డీయే పక్షమయిన బీజేపీ మూడు రాజధానుల అంశంలో ఒకటి అయిన కర్నూలు లో హై కోర్ట్ ఏర్పాటుపై ఇచ్చిన సమాధానం ఇప్పుడు కీలకంగా మారనుంది. AP-NEW-HIGH COURT-ISSUE;bharatiya janata party;korcha;amaravati;andhra pradesh;kurnool;capital;court;minister;central government;supreme court;ycpఏపీ హై కోర్ట్ తరలింపులో కేంద్రం వైఖరి సబబేనా...?ఏపీ హై కోర్ట్ తరలింపులో కేంద్రం వైఖరి సబబేనా...?AP-NEW-HIGH COURT-ISSUE;bharatiya janata party;korcha;amaravati;andhra pradesh;kurnool;capital;court;minister;central government;supreme court;ycpFri, 02 Apr 2021 14:29:23 GMTఏపీలో మళ్ళీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు ప్రతి పక్ష టీడీపీతో పాటు కొని వైసీపీ వ్యతిరేఖ పార్టీలు మూడు రాజధానుల అంశానికి అడ్డు తగులుతుంటే...వైసీపీ మాత్రం ఖచ్చితంగా రాజధాని వికేంద్రీకరణ చేసి తీరుతాం అంటూ ఆ వ్యవహారాల్లో ముందుకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రలో అధికారంలో ఉన్న ఎన్డీయే పక్షమయిన బీజేపీ మూడు రాజధానుల అంశంలో ఒకటి అయిన కర్నూలు లో హై కోర్ట్ ఏర్పాటుపై ఇచ్చిన సమాధానం ఇప్పుడు కీలకంగా మారనుంది. మూడు రాజధానుల ప్రక్రియను తీసుకొచ్చినప్పుడు అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయవ్యవస్థకు రాజధానిగా మరియు విశాఖపట్నం ను పరిపాలనా రాజధానిగా బిల్లులో పెట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా కర్నూలు కు హై కోర్ట్ తరలించే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే సమాచార హక్కు చట్టము క్రింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం.... ఇటు ప్రభుత్వాన్ని మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. 

ఈ హై కోర్టును మార్చే విషయం పూర్తియిగా రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు హై కోర్ట్ ఇద్దరూ చర్చించుకుని చేసుకోవాలి కేంద్రం తేల్చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు అని చెప్పకనే చెప్పింది. కర్నూల్ లో స్థలాన్ని పెట్టుకుని హై కోర్ట్ వారితో మాట్లాడుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనట. అప్పుడు కూడా అమరావతి రాజధాని విషయంలో మాకు సంబంధం లేదు అన్నదో, ఇప్పుడు కూడా అదే తీరుతో వ్యవహరిస్తోంది. కానీ వాస్తవంగా కనీసం మధ్యవర్తిగా ఎవరో ఒకరు ఉండాల్సిన అవసరం ఉందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. హై కోర్టుకు పైన సుప్రీం కోర్ట్ ఉంది...అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పైన కేంద్ర ప్రభుత్వం ఉంది. గతంలో రాష్ట్ర విభజన తరువాత, హై కోర్టును విభజించాలంటే ఏమి జరిగిందో మీకు తెలీదా...? ఆనాడు కేంద్ర న్యాయశాఖా మంత్రి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తితో చర్చించిన తరువాతే విభజన జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడెందుకు ఇలా మెలిక పెడుతున్నారో అర్ధం కావడం లేదని కొంతమంది పెద్దలు అడుగుతున్నారు.

ఒక వేళ కేంద్రం చెబుతున్నట్లు హై కోర్ట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం  కూర్చుని మాట్లాడుకుని తరలించుకుంటే...రేపు ఏదైనా సమస్య రాకుండా ఉంటుందని గ్యారంటీ ఉందా...? రేపు ఎవరైనా న్యాయవాదులు కానీ లేదా వేరెవరైనా కేసులు వేస్తే పరిస్థితి ఏంటి...? ఆ కేసులు సుప్రీం కోర్టుకి వెళితే ఎప్పుడేమి చెయ్యాలి...? ఇలా పలు సందేహాలు నెలకొన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది. ఇది ఇలా ఉంటే అసలు కర్నూలులో హై కోర్ట్ ఏర్పాటు విషయాన్ని బీజేపీనే తమ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టింది. అలాంటప్పుడు ఈ విధంగా ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది రాజకీయ ప్రముఖులు విమర్శిస్తున్నారు. మరి వీటన్నింటికీ అటు కేంద్రంతో పాటు బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.



తుమ్మల ఆలోచన ఏ విధంగా ఉంది...?

వామ్మో.. ! కార్తీక దీపం సీరియల్ మరో నాలుగు ఏళ్ల పాటు ప్రసారం అవుతుందట.. !!

ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన జాతిరత్నాలు..!!

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే హైలైట్ అట...!!

ఎన్నికల కమీషన్ కు షాక్ ఇచ్చిన జనసేన

చంద్రబాబు ప్రధాని అంటూ సుజనా కామెంట్స్

గోదావ‌రిలో ఏడుగురు గ‌ల్లంతు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>