Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbna917cbe7-6a93-4348-9dc5-25cc4506e836-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cbna917cbe7-6a93-4348-9dc5-25cc4506e836-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.ఇక మరికొన్ని రోజుల్లో పరిషత్ ఎన్నికలు జరిగేందుకు అంతా సిద్ధం అవుతుంది. ఈ నెల 8వ తేదీన ఏపీలో జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మొన్నటికి మొన్న జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి సత్తా చాటి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ చివరికి చతికిలబడి పోయింది. ఈ క్రమంలోనే టిడిపి ప్రస్తుతం నైరాశ్యం లో ఉండిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈనెల 8వ తేదీన జరగబోతున్న జెడ్Cbn;jeevitha rajaseskhar;andhra pradesh;panchayati;tdp;ycp;partyచంద్రబాబు రాజకీయ జీవితంలో చారిత్రాత్మక తప్పిదం.. ఇదేంటి సారూ..?చంద్రబాబు రాజకీయ జీవితంలో చారిత్రాత్మక తప్పిదం.. ఇదేంటి సారూ..?Cbn;jeevitha rajaseskhar;andhra pradesh;panchayati;tdp;ycp;partyFri, 02 Apr 2021 16:09:02 GMTమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.ఇక మరికొన్ని రోజుల్లో పరిషత్ ఎన్నికలు జరిగేందుకు అంతా సిద్ధం అవుతుంది. ఈ నెల 8వ తేదీన ఏపీలో జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మొన్నటికి మొన్న జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి సత్తా చాటి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ చివరికి చతికిలబడి పోయింది. ఈ క్రమంలోనే టిడిపి ప్రస్తుతం నైరాశ్యం లో ఉండిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.


 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈనెల 8వ తేదీన జరగబోతున్న జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు అని ఒక వార్త వైరల్ గా మారిపోయింది. మరికొన్ని రోజులలో జరగబోయే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని టిడిపి పార్టీ యోచిస్తున్నది. అయితే వైసిపి బలవంతపు ఏకగ్రీవాలు చేయడం వల్లే ఇక పరిషత్ ఎన్నికల్లో బైకాట్ చేయాలని టిడిపి భావిస్తోంది అని పైపైన చర్చ జరుగుతున్నప్పటికీ అసలు కారణం మాత్రం వేరే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.



 ఇప్పటికే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలలో ఎంతగానో ఖర్చుపెట్టిన టిడిపి నేతలు మళ్ళీ భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరని ఇప్పుడు అధికార పార్టీ భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక వారికి పోటీగా ఖర్చుపెట్టే స్థితిలో టిడిపి నేతలు లేకపోవడంతో పరిషత్ ఎన్నికలలో పరువు తీసుకోవడం ఇష్టం లేక టిడిపి  పరిషత్ ఎన్నికల నుండి పూర్తిగా తప్పుకుంటుంది అని అంటున్నారు. అయితే ఒకవేళ టిడిపి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం అది చంద్రబాబు రాజకీయ జీవితంలో చారిత్రాత్మక తప్పిదం గా మిగిలిపోతుంది అంటున్నారూ విశ్లేషకులు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని గెలుపు ఓటములను స్వీకరించి ముందుకు కదలాలి తప్ప ఇలా తప్పుకోవడం సరైన పద్ధతి కాదు అని అంటున్నారు విశ్లేషకులు



ట్రోలర్స్ పై ఫైర్ అయిన యువ సంగీత దర్శకుడు...?

నా తండ్రి హ‌త్య కేసు గురించి వ‌దిలేయ‌మ‌ని చాలామంది చెప్పారు

మీకెందుకు.. ముందు మీరు కానివ్వండి... త‌ర్వాత చూద్దాం!!

నభా నటేష్ పరిస్థితి అసలు బాగా లేదుగా... ఒక్క అవకాశం కోసం ఎదురు చూపు...

తెలంగాణా కాంగ్రెస్ ను కాపాడుతున్న తెరాస...?

తుమ్మల ఆలోచన ఏ విధంగా ఉంది...?

వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ అన్ని క్యాన్సల్ అంట...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>