PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kadapa-steel7fa75ac4-59fc-4f82-b476-bda502b842c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kadapa-steel7fa75ac4-59fc-4f82-b476-bda502b842c4-415x250-IndiaHerald.jpgకడపలో స్టీల్ ఫ్యాక్టరీ.. ఇది జగన్ సర్కారు కల. వైఎస్ హయాం నుంచి ఈ కల పెండింగ్‌లోనే ఉంది. జగన్ సీఎం అయ్యాక.. ఈ స్టీల్ ఫ్యాక్టరీ కోసం చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. త్వరగా పరిశ్రమ కల సాకారం చేయాలని ప్రయత్నించారు. కానీ.. ఇందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం లిబర్టీ స్టీల్స్‌ అనే కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ అంశంపై మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు. లిబర్టీ స్టీల్స్‌ అనే కkadapa-steel;amala akkineni;gautham new;gautham;jagan;district;industries;kadapa;minister;reddyపాపం.. జగన్ సొంత జిల్లాలో ఆ పరిశ్రమకు ఎన్ని కష్టాలో..!?పాపం.. జగన్ సొంత జిల్లాలో ఆ పరిశ్రమకు ఎన్ని కష్టాలో..!?kadapa-steel;amala akkineni;gautham new;gautham;jagan;district;industries;kadapa;minister;reddyThu, 01 Apr 2021 06:26:01 GMTకడపలో స్టీల్ ఫ్యాక్టరీ.. ఇది జగన్ సర్కారు కల. వైఎస్ హయాం నుంచి ఈ కల పెండింగ్‌లోనే ఉంది. జగన్ సీఎం అయ్యాక.. ఈ స్టీల్ ఫ్యాక్టరీ కోసం చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. త్వరగా పరిశ్రమ కల సాకారం చేయాలని ప్రయత్నించారు. కానీ.. ఇందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం లిబర్టీ స్టీల్స్‌ అనే కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు. అది కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది.

ఈ అంశంపై మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి  తాజాగా వివరణ ఇచ్చారు. లిబర్టీ స్టీల్స్‌ అనే కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించామని, అయితే ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టామని పేర్కొన్నారు. లిబర్టీ స్టీల్స్ కు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయని, ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్‌పై పడిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న విషయం సహేతకం కాదని భావించి పెండింగ్‌లో పెట్టామని వివరణ ఇచ్చారు.

కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై లిబర్టీ స్టీల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా లేక ప్రభుత్వమే నేరుగా చేపట్టాలా అనే అంశం పరిశీలనలో ఉందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. దీనిపైత్వరలో ఏ నిర్ణయం వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వానికి ప్లాన్-బి అమలు చేసే ఉద్దేశం కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ. 1000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ. 300 కోట్ల ప్రొత్సహాకాలు అందిస్తున్నామని మంత్రి గౌత‌మ్‌రెడ్డి పేర్కొన్నారు. మరి ఆ చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో.. ఎప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ కల సాకారం అవుతుందో అన్న ఆందోళన కడప జిల్లా వాసుల్లో కనిపిస్తోంది.  



హమ్మో.. మాస్ హీరో సినిమా అన్నికోట్ల ధర పలికిందా..??

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?

అక్కడ టీడీపీకి పవన్ కావాల్సిందేనా?

తాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు మమత పెద్ద షాక్

ఈ సారి దేవినేని ఫిక్స్ చేసుకున్నట్లేనా..!

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>