MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-new-movied6128a82-a7df-4e6d-a120-587bb06db99b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-new-movied6128a82-a7df-4e6d-a120-587bb06db99b-415x250-IndiaHerald.jpgఅసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని... అష్టా చమ్మా సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుండి ప్రతి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరచుకుంటూ తన టాలెంట్ తో తనేంటో నిరూపించుకున్నాడు నాని. ఎంతో సహజమైన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలలో నాని కూడా ఒకరు.NANI-NEW-MOVIE;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;atreya;poorna;rithu;shyam;siva nirvana;vivek;cinema;director;lord siva;hero;silver;letter;kusuma jagadish;shiva nirvana;bhale bhale magadivoy;tuck jagdish;tuck jagadish;chitramనాని కొత్త సినిమా సెట్స్ పైకి...!నాని కొత్త సినిమా సెట్స్ పైకి...!NANI-NEW-MOVIE;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;atreya;poorna;rithu;shyam;siva nirvana;vivek;cinema;director;lord siva;hero;silver;letter;kusuma jagadish;shiva nirvana;bhale bhale magadivoy;tuck jagdish;tuck jagadish;chitramThu, 01 Apr 2021 19:41:09 GMTఅసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని... అష్టా చమ్మా సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుండి ప్రతి అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరచుకుంటూ తన టాలెంట్ తో తనేంటో నిరూపించుకున్నాడు నాని. ఎంతో సహజమైన నటనతో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలలో నాని కూడా ఒకరు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షూటింగ్ లతో జోరుగా సాగుతున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా టక్ జగదీష్ సినిమా ను కంప్లీట్ చేసి విడుదలకు రంగం సిద్ధం చేశాడు. ఈ చిత్రం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది.

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బాస్టర్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తోన్న ‘టక్ జగదీష్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాతో పాటు నాని ఓ పీరియాడికల్ సినిమా చేస్తున్న విషయం విధితమే. శ్యామ్ సింగరాయ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని  ఓ కొత్త పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నాడు . కాగా శ్యామ్ సింగరాయ్ ఇప్పుడు బిజీ బిజీగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇదిలా ఉండగా తాజాగా... హీరో నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే నాని 'అంటే సుందరానికి' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం... భలే భలే మగాడివోయ్ సినిమా లాగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్  పూర్తి కావడంతో వెను వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.



అభిమానుల కోసం ఒకటి అంటున్న చార్మీ...?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>