PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender-teenmar-mallanna62b05508-3c11-4f7c-a093-0febcfb1a5a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajender-teenmar-mallanna62b05508-3c11-4f7c-a093-0febcfb1a5a7-415x250-IndiaHerald.jpg మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్ గా కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయం నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ అనుచరురాలు , కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయను గద్దె దింపడమే లక్ష్యంగా ఓ వర్గం పావులు కదుపుతోందనే వార్తలు వస్తున్నాయి.etela rajender teenmar mallanna;raaga;hyderabad;telangana rashtra samithi trs;eatala rajendar;hosta;district;huzur nagar;minister;karimnagar;etela rajender;partyఈటలకు పొగ బెడుతున్నారా?ఈటలకు పొగ బెడుతున్నారా?etela rajender teenmar mallanna;raaga;hyderabad;telangana rashtra samithi trs;eatala rajendar;hosta;district;huzur nagar;minister;karimnagar;etela rajender;partyThu, 01 Apr 2021 08:32:17 GMTతెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగం ముదురుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా  పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్న మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్ గా కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయం నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ అనుచరురాలు , కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయను గద్దె దింపడమే లక్ష్యంగా ఓ వర్గం పావులు కదుపుతోందనే వార్తలు వస్తున్నాయి. చొప్పదండి సమీపంలోని ఓ మామిడి తోటలో 11 మంది జడ్పీటీసీ సభ్యులు సమావేశం కావడం గులాబీ పార్టీలో వేడి పుట్టిస్తోంది.  జిల్లాలోని 15 జడ్పీటీసీ స్థానాల్లో ఒక చైర్ పర్సన్ , ఒక వైస్ చైర్మన్‌ పోగా .. మిగిలిన 13 మందిలో 11 మంది ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఈటల మద్దతుదారైన  జడ్పీ చైర్ పర్సన్‌పై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానానికి రెడీ కావడం వెనుక ఒక కీలక నేత హస్తం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్‌గా కనుమల్ల విజయ రెండేళ్ల కింద బాధ్యతలు చేపట్టారు. ఈమెది ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ పరిధిలోని ఇల్లందకుంట. మంత్రి అనుచరురాలు కావడంతో అప్పట్లో ఆయన పట్టుబట్టి మరీ ఆమెను జడ్పీ చైర్ పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే మొదటి నుంచి జడ్పీటీసీ సభ్యులకు, ఈమెకు మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఎస్ఎఫ్‌సీ, డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌లో తమకు న్యాయమైన వాటా రావట్లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను తప్పిస్తే కొత్త చైర్ పర్సన్ అయ్యే అవకాశం ఒక్క చొప్పదండి జడ్పీటీసీ సభ్యురాలికే ఉంది. చొప్పదండిలో మీటింగ్ జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. చైర్‌పర్సన్ ఎన్నికై త్వరలో రెండేళ్లు పూర్తవుతున్నందున అవిశ్వాస తీర్మానం పెట్టాలని చర్చించుకున్నారని తెలుస్తోంది.

జడ్పీ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి 11 మంది జడ్పీటీసీలు ప్లాన్ వేస్తున్నారనే విషయం  తెలియడంతో జడ్పీటీసీలందరినీ మంత్రి ఈటల హుటాహుటిన హుజూరాబాద్ పిలిపించారు . చైర్ పర్సన్‌ను కూర్చోబెట్టి ఆయా సమస్యలపై చర్చించారు . సొంత పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేయొద్దని ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పంపించారు . ఇది జరిగిన తర్వాత మూడు రోజుల కింద కూడా ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్సఫర్లలో తమ మాట చెల్లడం లేదని , మరోసారి ఐదుగురు జడ్పీటీసీలు మంత్రి ఈటలను కలిశారు . దీంతో ఆయన జడ్పీ చైర్ పర్సనను హైదరాబాద్ పిలిపించి మందలించినట్లు సమాచారం.
 



గుడ్ న్యూస్‌: నేటి నుంచి వంట గ్యాస్ సిలిండ‌ర్ రేటు త‌గ్గుతుందోచ్

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>