PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-cji57b7a816-cae7-42eb-8e91-e5c79422841c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-cji57b7a816-cae7-42eb-8e91-e5c79422841c-415x250-IndiaHerald.jpgక్విడ్‌ ప్రో కో.. అంటే నీకది-నాకిది అంటూ పంచుకోవడం.. ఇది ఓ రకమైన నేరం.. ఈ పదం మొదట్లో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో బాగా పాపులర్ అయ్యింది. అంటే.. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవారు.. తమ అధికారాన్ని ఉపయోగించి.. ఎదుటి వారికి మేలు చేయడం.. వారి నుంచి లాభం ఆశించడం.. అయితే ఇది సహజంగా రాజకీయ నాయకులు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ తరహా జాడ్యం న్యాయవ్యవస్థకూ సోకిందా అన్న అనుమానాలు జనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. మోడీ సర్కారు హయాంలో ఆయనకు అనేక రకాలుగా మేలు చేసిన న్యాయవ్యవస్థలోని వ్యక్తులకు ఆ తర్వాత మోడీ పీmodi-cji;modi;amit shah;jeevitha rajaseskhar;kerala;bharatiya janata party;jagan;amith shah;rajya sabha;bcci;governor;traffic policeన్యాయవ్యవస్థలోనూ క్విడ్‌ ప్రో కో..? నివ్వెరపోయే నిజాలు..?న్యాయవ్యవస్థలోనూ క్విడ్‌ ప్రో కో..? నివ్వెరపోయే నిజాలు..?modi-cji;modi;amit shah;jeevitha rajaseskhar;kerala;bharatiya janata party;jagan;amith shah;rajya sabha;bcci;governor;traffic policeThu, 01 Apr 2021 09:00:20 GMTక్విడ్‌ ప్రో కో.. అంటే నీకది-నాకిది అంటూ పంచుకోవడం.. ఇది ఓ రకమైన నేరం.. ఈ పదం మొదట్లో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో బాగా పాపులర్ అయ్యింది. అంటే.. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవారు.. తమ అధికారాన్ని ఉపయోగించి.. ఎదుటి వారికి మేలు చేయడం.. వారి నుంచి లాభం ఆశించడం.. అయితే ఇది సహజంగా రాజకీయ నాయకులు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ తరహా జాడ్యం న్యాయవ్యవస్థకూ సోకిందా అన్న అనుమానాలు జనం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే.. మోడీ సర్కారు హయాంలో ఆయనకు అనేక రకాలుగా మేలు చేసిన న్యాయవ్యవస్థలోని వ్యక్తులకు ఆ తర్వాత మోడీ పీఎం అయ్యాక వరుసగా మేలు జరుగుతోంది. దీన్ని న్యాయవ్యవస్థలోని క్విడ్ ప్రోకో అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా అనేక నిదర్శనాలు చూపుతున్నారు. అందులో మొదటిది కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యిన రంజన్ గగోయ్.. తన పదవీ కాలంలో మోడీ సర్కారుకు మేలు చేసేలా అనేక తీర్పులు ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. ఆయనకు పదవీవిరమణ తర్వాత బీజేపీ సర్కారు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడమూ వివాదాస్పదమైంది.

అలాగే ఫేక్ ఎన్‌కౌంటర్ కేసు నుంచి అమిత్‌ షాకు క్లీన్ చిట్ ఇచ్చినందుకు జస్టిస్ సదాశివంకు ఆ తర్వాత కాలంలో ఆయన రిటైర్ అయ్యాక కేరళ గవర్నర్ గా పదవి ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇదే కేసులో అమిత్ షా తరపున వాదించిన లాయర్ యుయు లలిత్.. ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అలాగే మోడీ రాజకీయ జీవితంలోనే మచ్చగా నిలిచిపోయే గోద్రా మారణ హోమం కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చిన వైసీ మోడీ ఆ తర్వాత కాలంలో ఎన్‌ఐఏకు చీఫ్‌గా నియమితులయ్యారు. ఇదే కేసులో మోడీకి అనుకూలంగా పని చేసిన మాజీ పోలీస్ బాస్ ఆర్కే రాఘవన్ కూడా  ఆ తర్వాత కాలంలో సైప్రస్ దేశానికి హైకమిషనర్‌ గా నియమితులయ్యారు.

యూపీఏ హయాంలో 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో లక్షల కోట్ల స్కామ్ స్కామ్ జరిగిందని నివేదిక ఇచ్చిన అప్పటి కాగ్‌ వినోద్‌ రాయ్‌కు మోడీ అధికారంలోకి వచ్చాక బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కింది. అలాగే పద్మభూషణ్ కూడా వరించింది. ఇలాంటి ఉదాహరణలు కూడా క్విడ్ ప్రో కో కేసుల కిందకే వస్తాయంటున్నారు జనం.





ఆర్టీసీకి దిన‌దిన గ‌డం.... ప్ర‌భుత్వం కూడా చేతులెత్తేస్తోందిగా..!

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>