MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakel-sab-sruthi-hasan-fans-angry5a6b275e-e57e-405f-9731-fbb7ab65aaee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakel-sab-sruthi-hasan-fans-angry5a6b275e-e57e-405f-9731-fbb7ab65aaee-415x250-IndiaHerald.jpgగత రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసే వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక అనుమానం రావడం సహజమే.అది ఏంటంటే వకీల్ సాబ్ సినిమాలోని హీరోయిన్ గురించి అన్నమాట. సినిమా టీజర్, పోస్టర్స్, ట్రైలర్, ప్రమోషన్స్ అంతా బాగానే ఉంది కానీ సినిమాలో హీరోయిన్ విషయం మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.విడుదల అయిన వకీల్ సాబ్ ట్రైలర్ మొత్తం 2 నిమిషాలు 9 సెకన్లు నిడివి ఉంది. ఇందులో కనీసం ఒక్క కVakel sab, sruthi hasan, fans, angry;pawan;ananya pandey;shruti;shruti haasan;ananya;anjali;kalyan;sruthi;cinema;heroine;nivetha thomas;ananya nagalla;krackవకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !Vakel sab, sruthi hasan, fans, angry;pawan;ananya pandey;shruti;shruti haasan;ananya;anjali;kalyan;sruthi;cinema;heroine;nivetha thomas;ananya nagalla;krackThu, 01 Apr 2021 13:30:00 GMTగత రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసే వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక  అనుమానం రావడం సహజమే.అది ఏంటంటే  వకీల్ సాబ్ సినిమాలోని హీరోయిన్ గురించి అన్నమాట. సినిమా టీజర్, పోస్టర్స్, ట్రైలర్, ప్రమోషన్స్ అంతా బాగానే ఉంది కానీ సినిమాలో హీరోయిన్ విషయం మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.విడుదల అయిన వకీల్ సాబ్ ట్రైలర్ మొత్తం  2 నిమిషాలు 9 సెకన్లు నిడివి ఉంది. ఇందులో కనీసం ఒక్క క్షణం కూడా హీరోయిన్ శృతి హాసన్ కనిపించలేదు. ఈ ట్రైలర్  చూసిన తర్వాత ఆమె అభిమానులు బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది . అందుకే సోషల్ మీడియాలో ఆమె అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాలో అమ్మాయిల పట్ల  న్యాయం చేస్తున్నాడు కానీ బయట హీరోయిన్ విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నాడు అంటూ పోస్టులు పెడుతున్నారు.


హీరోయిన్ ను కనీసం ఒక్క షాట్ లో  కూడా చూపించకపోవడం ఏమి బాగోలేదు అని  శృతి హాసన్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.ఒకసారి  ట్రైలర్ చూస్తే  నివేదా థామస్, అంజలి, అనన్య ఇలా ఈ ముగ్గురు ఆడవాళ్ళని మాత్రమే అంత సేపు చూపించారు కానీ మైన్  హీరోయిన్ ను దాచేశారు అంటూ అభిమానులు మండి పడుతున్నారు. ఇది ఇలా ఉంటే మరో వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  రంగంలోకి దిగి ఆ కామెంట్స్ ని పక్కకు తోస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ రివీల్  కాకూడదనే ఉద్దేశంతోనే ఆమెను ట్రైలర్లో చూపించలేదేమో.. అలా ఎందుకు ఆలోచించరు అని అంటున్నారు.


అంతేకాదు అవకాశాలు లేని సమయంలో శృతి హాసన్ కి పవన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు..ఆ విషయం మరచిపోకూడదు మీరు అంటూ అభిమానులు తిరిగి పోస్టులు పెడుతున్నారు.నిజానికి వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువ నిడివితో ఉంటుందట. కానీ మన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఇంకాస్త పెంచినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో శృతిని చూపించకపోయినా సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాలా బాగుంటుందని.. కచ్చితంగా మంచి పేరు వస్తుంది అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ ఏడాది మొదటిలోనే శృతి హాసన్ క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. మరి వకీల్ సాబ్ సినిమాతో కూడా ఆ హిట్ ని కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.. !!



గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..?

సత్యదేవ్ అగ్రహీరోల ధాటికి నిలవగలడా...?

పవన్ విషయంలో బిజెపి కార్యకర్తలు ఇది గమనించాలి...?

విజయసాయి అందుకే బిజెపిని తిడుతున్నారా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

ఆపరేషన్ నాగార్జున సాగర్.. కేసీఆర్ స్పెషల్ ప్లాన్ !

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>