బెంగళూరు అత్త…. ఆంధ్రా కొడలు
బెంగళూరులోని ఉదయనగర్ లో 56 ఏళ్ల సంగీత (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. సంగీత కుమారుడు కిరణ్ ఆంధ్రప్రదేశ్ లోని రమ్య (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కిరణ్, రమ్య బెంగళూరులోని ఉదయనగర్ లోని కాపురం ఉండేవాళ్లు.
మొగుడు పెళ్లాం ఢిష్యూం ఢిష్యూం
వివాహం జరిగిన తరువాత కొంతకాలం సంతోషంగా గడిపిన కిరణ్, రమ్య తరువాత గొడవలు పడటం మొదలుపెట్టారు. దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో ఒకటిన్నర సంవత్సరాల క్రితం రమ్య భర్త కిరణ్ తో తెగతెంపులు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.
అత్త ఆధార్ కార్డుతో ?
రమ్య భర్త కిరణ్ తో తెగతెంపులు చేసుకునే సమయంలో అత్త సంగీత, భర్త ఆధార్ కార్డులు బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లిందని సమాచారం. అత్త ఆధార్ కార్డు ఇచ్చిన కొడలు, ఆమె ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్ లోని బంగారు నగల షాప్ లో 80 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేశారని బెంగళూరులో ఉన్న అత్త సంగీతకు తెలిసిపోయింది.
కొడలి దెబ్బతో అత్తకు ఆయాసం
మా అత్త సంగీత అనారోగ్యంతో ఉందని, ఆమె తరువాత వచ్చి మీకు డబ్బులు ఇస్తుందని జ్యువెలరీ షాప్ యజమానికి మాయమాటలు చెప్పిన మాజీ కొడులు రమ్య రూ. 3 లక్షల విలువైన బంగారు నగలు తీసుకుని వెళ్లిందని బెంగళూరులో ఉన్న అత్త సంగీతకు తెలిసింది. కొడలు చేసిన పనికి అత్త సంగీత హడలిపోయింది.
వరకట్నం వేధింపుల కేసు పెడుతా
నువ్వు చేసిన పని ఏమిటి అని నేను ఫోన్ చేసి మాజీ కొడలు రమ్యను ప్రశ్నిస్తే మీరు మర్యాదగా ఉండాలని, లేదంటే వరకట్నం వేధింపుల కేసు పెడుతానని, జైలుకు పంపిస్తానని తనను బెదిరిస్తోందని అత్త సంగీత బెంగళూరులో కొడలు రమ్య మీద కేసు పెట్టింది. అత్త సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.