Telangana
oi-Rajashekhar Garrepally
ఒట్టావా/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా దిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. గురువారం ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే, ప్రవీణ్ రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశం వెళ్లి అక్కడ బలవన్మరణానికి పాల్పడటంతో ప్రవీణ్ రావు కుటుంబంతోపాటు అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తమ కుమారుడు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం పట్ల ప్రవీణ్ రావు తల్లిదండ్రులు నారాయణరావు, హైమావతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ప్రవీణ్ రావు.. ఉన్నతాశయంతో విదేశాలకు వెళ్లాడని, కానీ, తన లక్ష్యం నెరవేర్చుకోకముందే ప్రాణాలు తీసుకోవడంపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.