PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-rebal-mp-raghurama-detailsf2bb332b-d108-4870-8adb-29f9eafad80e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-rebal-mp-raghurama-detailsf2bb332b-d108-4870-8adb-29f9eafad80e-415x250-IndiaHerald.jpgమాములుగా రాజకీయాలు అన్నాక ఒక పార్టీలోనే శత్రుత్వాలు ఉండడం సహజము. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా అధికార దాహమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇదే విధంగా మనకు ఏపీలో ఉన్న ఒక నాయకుడి పరిస్థితి కనిపిస్తుంది. అతనెవరో కాదు ఏపీలోని నరసాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రతి ఒక్క నాయకుడు ఎన్నికలకు ముందు బాగానే ఉంటారు. YCP-REBAL-MP-RAGHURAMA-DETAILS;amit shah;krishna;nithya new;prasanna;raghu;delhi;bharatiya janata party;jagan;narendra modi;amith shah;janasena;rbi;mp;media;parliment;cbi;letter;tdp;local language;central government;ycp;janasena party;party;shatru1;mantra;narendraవైసీపీ ఎంపీ ఆఖరికి "ఆర్ఎస్ఎస్" ని కూడా వాడేశాడుగా...?వైసీపీ ఎంపీ ఆఖరికి "ఆర్ఎస్ఎస్" ని కూడా వాడేశాడుగా...?YCP-REBAL-MP-RAGHURAMA-DETAILS;amit shah;krishna;nithya new;prasanna;raghu;delhi;bharatiya janata party;jagan;narendra modi;amith shah;janasena;rbi;mp;media;parliment;cbi;letter;tdp;local language;central government;ycp;janasena party;party;shatru1;mantra;narendraThu, 01 Apr 2021 21:30:00 GMTమాములుగా రాజకీయాలు అన్నాక ఒక పార్టీలోనే శత్రుత్వాలు ఉండడం సహజము. దీనికి పలు కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా అధికార దాహమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇదే విధంగా మనకు ఏపీలో ఉన్న ఒక నాయకుడి పరిస్థితి కనిపిస్తుంది. అతనెవరో కాదు ఏపీలోని నరసాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రతి ఒక్క నాయకుడు ఎన్నికలకు ముందు బాగానే ఉంటారు. పార్టీ అధిష్టానం చెప్పిన విధంగానే నడుచుకుంటారు. కానీ ఒక్కసారి ఎన్నికల్లో గెలిచారా...? వీరి వ్యవహారం మరియు ప్రవర్తించే తీరు మారిపోతుంది. కానీ అందరూ అలా ఉండరు. మరి కొందరు పార్టీ పట్ల విధేయత లేని వారే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ఈ రఘు రామ కృష్ణం రాజు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ వైసీపీ కి ఇటు జగన్ కు వ్యతిరేకంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.

ఎప్పుడు చూసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తన వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే దీని కంతటికీ కారణం చూస్తే...రఘు రామ అడిగిన పదవులకు జగన్ ఒప్పుకోకపోవడమే అంటున్నారు రాజకీయ వర్గాలు. తరచూ ఈయన బీజేపీ పెద్దలతో మరియు ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ మంత్రులతో భేటీ అవుతుండడం విశేషం. ఈయన మీడియా ముందు నాకు మోదీ సపోర్ట్ ఉంది, అమిత్ షా ఆశీర్వాదం ఉంది అని చెప్పుకుంటుంటారు. కానీ ఒకవైపు మాత్రం ఈయనపై ఈ డి కేసులు అలాగే సిబిఐ కేసులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మోదీ సపోర్ట్ ఉంటే ఇవన్నీ జరగకూడదు కదా అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రజలకు తెలియకుండా చాలా చక్కగా కవర్ చేసుకుంటూ చలామణీ అవుతున్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ గా దత్తాత్రేయ గారు ఎన్నికయిన విషయం తెలిసిందే.  నిన్న మన రఘు రామ రాజు ఈయనను ఢిల్లీ లో కలిశారట. వీరు ముఖ్యంగా ఏపీలో జరిగిన మాత మార్పిడి మరియు దేవాలయాలపై దాడుల గురించి చర్చించారని వినికిడి.  

కేవలం ఈ విషయాల గురించి నరేంద్ర మోదీ కి లేఖ రాసినందుకు గానూ నన్ను నియోజకవర్గంలోకి కూడా రానివ్వకుండా నిరసనలు చేశారని ఆయనతో మొరపెట్టుకున్నారని సమాచారం.  ఈ సంఘటన చూస్తే ఎలా ఉందంటే, రాజు గారు తన రాజకీయ స్వార్ధం కోసం ఏకంగా ఆర్ఎస్ఎస్ ను మరియు బీజేపీని రెండింటినీ వాడేసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన కింద ఉన్న కార్యకర్తలు సైతం ఇలాంటి విషయాలను గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రఘు రామ రాజు ఒకవైపు బ్యాంకులకు 500 కోట్ల వరకు బకాయిలు ఉన్నాడు. అంతే కాకుండా అను నిత్యం వైసీపీతో గొడవపెట్టుకుంటూ ఉన్నాడు. ఈ కారణంగా స్థానిక వైసీపీ నాయకులు ఆయనపై గొడవ పడుతున్నారు. దీనికి ధర్మానికి సంబంధం ఏమిటి...? మొత్తానికి తరువాత ఎన్నికలలో వైసీపీ తరపున టికెట్ రాదు..అందుకే ఇప్పటినుండే టీడీపీ మరియు జనసేన లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు రాజు గారు. దీనికి తోడు జగన్ వ్యతిరేఖ చానెళ్లు ఈయన చెప్పిన విషయాలన్నీ ప్రసారం చేస్తుంటాయి. మరి చూద్దాం ఏమి జరుగుతుందో...?






కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>