Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruits781bd723-c9d1-402a-8f5d-21c2df3e77fd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fruits781bd723-c9d1-402a-8f5d-21c2df3e77fd-415x250-IndiaHerald.jpgప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ వయసుతో సంబంధం ఉండటం లేదు. డయాబెటిస్ సోకితే ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఎప్పుడు తినాలి.. అనే మీమాంశ అందరిలో ఉంటుంది. ఆహారంలో ఏది ఉత్తమం, పండ్లు విషయంలో కూడా అనుమానాలే ఉంటాయి. దీంతో అందరిలో గందరగోళమే ఉంటుంది. డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణపై చూపే ఆహారం తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ బారిన పడ్డవారు పండ్లు తినే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతూంటారు. కానీ.. వారు తాజా పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చనే అంటున్నారు నిపుణులు. fruits;chiranjeevi;samatha;cancer;sugar;local language;cinnamonడయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్లను తీసుకోవాలి...?డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్లను తీసుకోవాలి...?fruits;chiranjeevi;samatha;cancer;sugar;local language;cinnamonThu, 01 Apr 2021 06:00:00 GMTడయాబెటిస్ వయసుతో సంబంధం ఉండటం లేదు. డయాబెటిస్ సోకితే ఏం తినాలి.. ఏం తినకూడదు.. ఎప్పుడు తినాలి.. అనే మీమాంశ అందరిలో ఉంటుంది. ఆహారంలో ఏది ఉత్తమం, పండ్లు విషయంలో కూడా అనుమానాలే ఉంటాయి. దీంతో అందరిలో గందరగోళమే ఉంటుంది. డయాబెటీస్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణపై చూపే ఆహారం తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ బారిన పడ్డవారు పండ్లు తినే విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతూంటారు. కానీ.. వారు తాజా పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చనే అంటున్నారు నిపుణులు.



 మీకు స్థానికంగా లభించే తాజా, సీజనల్ పండ్లను మిస్ కాకుండా తినేయండి. ముఖ్యంగా తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన పండ్లను తీసుకోవడం శ్రేయస్కరం. అయితే, పండ్లను ఎప్పుడూ భోజనంతో కలిపి తీసుకోకూడదు. లంచ్ - డిన్నర్‌కు మధ్య చిరుతిండ్లగా పండ్లను తీసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడే దాల్చిన చెక్క పొడిన పండ్ల మీద చల్లుకుని తింటే మంచిది. చక్కెర కలిపిన పండ్ల రసాన్ని తినకండి. నేరుగా పండ్లను తింటే అందులో ఫైబర్ శరీరానికి అందుతుంది. కేవలం పచ్చిగా ఉండే పండ్లనే తినాలి. ఉడికించనవి తినకూడదు. మరి, ద్రాక్ష పండ్లను తినొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.


 ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ అనే ఫైటోకెమికల్‌‌ను కనుగొన్నారు. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. అయితే, డయాబెటిస్ బాధితులకు కేవలం నల్ల ద్రాక్ష మాత్రమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంటున్న సీడ్‌లెస్ ద్రాక్షను మాత్రం అతిగా తీసుకోవద్దని, తినాలపిస్తే.. రోజుకు ఒక కప్పు తీసుకోండని తెలుపుతున్నారు. అయితే, నల్ల ద్రాక్ష ఈ ద్రాక్షలు కంటే మెరుగ్గా పనిచేస్తుందని, డయాబెటిస్‌కు మేలు చేస్తుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. చక్కెర వేయకుండా ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకోవడమే మంచిదేనని సూచిస్తున్నారు. ద్రాక్ష మాత్రమే కాకుండా డయాబెటీస్ బాధితులు ఇంకా ఏయే పండ్లను తీసుకోవచ్చో చూద్దామా.


అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రీషియన్ అధ్యయనం ప్రకారం.. బ్లూబెర్రీ, నల్లద్రాక్షతో కలిపి యాపిల్ పండ్లను తినడం చాలామంచిదని, ఇది టైప్-2 డయాబెటీస్‌ను తగ్గిస్తుంని పేర్కొంది.లో-గ్లైసెమిక్ ఇండెక్స్ గల పండ్లలో స్ట్రాబెర్రీస్‌ ఒకటి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది. ఇది క్యాన్సర్ కణాలతో సైతం పోరాడుతుంది. అలాగే, జీవక్రియను సైతం పెంపొందిస్తుంది. బరువును తగ్గించేందుకు కూడా స్ట్రాబెర్రీస్‌ సహకరిస్తాయి. డయాబెటిస్ బాధితులకు జామ పండు చాలామంచిది. ఇందులో కూడా గ్లెసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఆకలితో ఉన్నప్పుడు చిల్లర తిండ్లకు బదులు జామ కాయాలను తింటే ఎంతో మేలు. డయాబెటిస్ ముప్పు నుంచి కూడా జామ పండ్లు కాపాడతాయి.



మధుమేహం ఉంటే పుచ్చకాయ తినకూడదని అంటారు. అయితే, కిడ్నీలకు మేలు చేసే మంచి ఫలం పుచ్చకాయ. డయాబెటిస్‌ బాధితులు పుచ్చకాయ తిన్నట్లయితే మూత్రపిండాలకు మేలు జరుగుతుంది. మధుమేహ బాధితులకు నరాలు సైతం దెబ్బతింటాయి. కాబట్టి.. పుచ్చకాయలో కనుగొన్న  ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. మధుమేహ బాధితులు బొప్పాయి తినడం చాలా మంచిది. ఇందులో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్రమరహిత బ్లడ్ షుగర్స్ వల్ల నరాలకు, గుండెకు చాలా నష్టం కలుగుతుంంది. అయితే, బొప్పాయి.. కణాల నష్టాన్ని అరికట్టి మరింత కాలం జీవించేందుకు సహకరిస్తుంది. అలాగే, ఆరెంజ్‌లో ఉండే ఫ్లావనోనెస్, ఫెనోలిక్ యాసిడ్లు సైతం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తాయి. కాబట్టి.. ఈ పండ్లను మిస్ కాకుండా తినండి. ఆరోగ్యంగా ఉండండి


"సలార్" పై అభిమానుల అనుమానాలు నిజమేనా..?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>