PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgఅధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ నర్సింహయ్య కుమారుడు భగత్ కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టికెట్ కేటాయించగా, బీజేపీ మాత్రం జానారెడ్డి అనుచరుడు చివరి నిమిషంలో పార్టీలో చేరిన డాక్టర్ రవి కుమార్ నాయక్ కు టికెట్ కేటాయించింది. అయితే దుబ్బాక ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న టిఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకోసం ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగడnagarjuna sagar by elections;view;kcr;amala akkineni;kumaar;nagarjuna akkineni;ravi anchor;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;doctor;janareddy;reddy;nayak;partyఆపరేషన్ నాగార్జున సాగర్.. కేసీఆర్ స్పెషల్ ప్లాన్ !ఆపరేషన్ నాగార్జున సాగర్.. కేసీఆర్ స్పెషల్ ప్లాన్ !nagarjuna sagar by elections;view;kcr;amala akkineni;kumaar;nagarjuna akkineni;ravi anchor;srinivas;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;doctor;janareddy;reddy;nayak;partyThu, 01 Apr 2021 11:00:00 GMTఅధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ నర్సింహయ్య కుమారుడు భగత్ కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టికెట్ కేటాయించగా, బీజేపీ మాత్రం జానారెడ్డి అనుచరుడు చివరి నిమిషంలో పార్టీలో చేరిన డాక్టర్ రవి కుమార్ నాయక్ కు టికెట్ కేటాయించింది. అయితే దుబ్బాక ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న టిఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకోసం ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఇక గెలుపు కోసం కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 ఆయన వ్యూహాలు అమలు పరిచేందుకు గాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. కులాల లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ యాదవ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు మంత్రిని కేసీఆర్ నియోజకవర్గానికి పంపినట్లు తెలుస్తోంది. ఆయన ఎన్నికలు పూర్తయ్యే చివరి వరకు అక్కడే ఉండి కేసీఆర్ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేయనున్నారు అని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలకు ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసిన కేసీఆర్ యాదవ సామాజిక వర్గం నేతలను కూడా బుజ్జగించినట్లు చెబుతున్నారు. 

వారితో నేరుగా ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా వారి వద్దకు పంపినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా కలిసి ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయనున్నట్లు చెబుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ బీజేపీలు సైతం ఇక్కడ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. దాదాపు ఇప్పటిదాకా పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు సైతం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ ఇక్కడ జానారెడ్డి పోటీలో ఉండడంతో ఆయన మీద నమ్మకం పెట్టుకుంది. బీజేపీ చివరి వరకు బలమైన అభ్యర్థిని దింపుతుందని భావించినా జానారెడ్డి అనుచరుడికి టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు గెలుపు మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




ర‌జ‌నీకి దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ వెన‌క ట్విస్ట్ ఇదే..!

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>