Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sachin-tendulkar439a6659-4925-4a81-aff7-82932882fa89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sachin-tendulkar439a6659-4925-4a81-aff7-82932882fa89-415x250-IndiaHerald.jpgకరోనా బారిన పడ్డ సచిన్ టెండూల్కర్ కోలుకోవాలని పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సచిన్ ముందు నువ్వెంత.. అతడు ఎదుర్కొన్న బౌలర్లలో నువ్వొకడివి అంతే’ అంటూ భారీ కౌంటర్లిస్తున్నారు. అంతేకాకుండా ‘అబ్బా సచిన్‌కు నువ్వు పోటీనా.. ఎంత పెద్ద జోక్ చెప్పావ్’ అని ఎగతాళి ..sachin tendulkar;sachin;sachin tendulkar;india;pakistan;twitter;shoaib akhtarసచిన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అక్తర్ ట్వీట్.. అతడిముందు నువ్వెంతంటూ కౌంటర్లిచ్చిన నెటిజన్లుసచిన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అక్తర్ ట్వీట్.. అతడిముందు నువ్వెంతంటూ కౌంటర్లిచ్చిన నెటిజన్లుsachin tendulkar;sachin;sachin tendulkar;india;pakistan;twitter;shoaib akhtarThu, 01 Apr 2021 19:05:00 GMTఇంటర్నెట్ డెస్క్: కరోనా బారిన పడ్డ సచిన్ టెండూల్కర్ కోలుకోవాలని పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సచిన్ ముందు నువ్వెంత.. అతడు ఎదుర్కొన్న బౌలర్లలో నువ్వొకడివి అంతే’ అంటూ భారీ కౌంటర్లిస్తున్నారు. అంతేకాకుండా ‘అబ్బా సచిన్‌కు నువ్వు పోటీనా.. ఎంత పెద్ద జోక్ చెప్పావ్’ అని ఎగతాళి చేస్తున్నారు.

అయితే కరోనా నుంచి కోలుకోవాలని అక్తర్ ట్వీట్ చేస్తే.. నెటిజన్లు ఇంత వైలెంట్‌గా ఎందుకు రిప్లై ఇస్తున్నారా..? అని సందేహం కలుగుతోందా..? అయితే దీనికి కారణం అతడు తన ట్వీట్‌లో వాడిన ఓ పదం. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముగిసిన రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిసిన తరువాత సచిన్ టెండూల్కర్‌తో సహా అనేకమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డాడు.

ఇండియా లెజెండ్స్‌ సభ్యులు బ‌ద్రీనాథ్‌, యూసుఫ్ ప‌ఠాన్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌ల‌కు కూడా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. వీరందరూ ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ స‌చిన్ త్వరగా కోలువాలంటూ పాక్‌ మాజీ స్పీడ్‌గన్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయ‌బ్ అక్తర్ ఓ ట్వీట్ చేశారు. మైదానంలో త‌న ఫేవ‌రేట్ ప్రత్యర్థి అయిన స‌చిన్‌ త్వరగా కోలుకోవాల‌ని అక్తర్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఇదే అతడిపై నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. అక్తర్‌.. స‌చిన్ త‌న‌కు ప్రత్యర్థి అనడంపై వారంతా మండిపడుతున్నారు.

‘సచిన్ నీకంటే ముందు ఎంతో మంది లెజెండరీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వ‌కార్ యూనిస్, వ‌సీం అక్రమ్, ఆంబ్రోస్‌, మెక్‌గ్రాత్‌, అలెన్‌ డొనాల్డ్‌‌ లాంటి దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్లకే స‌చిన్ చుక్కలు చూపించాడు. అతడి ముందు నువ్వెంత. అతడు ఎదుర్కొన్న బౌలర్లలో నువ్వు కూడా ఓ సాధారణ బౌలర్‌వి అంతే. స‌చిన్‌కు నీవు ఏ విధంగానూ ప్రత్యర్థివి కావు. వకార్, వసీంలు ఆ మాట అంటే బాగుంటుంది కానీ నీవంటే నవ్వొస్తోంది’ అంటూ అభిమానులు అక్తర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు.. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్రమ్‌, వకార్‌లతోపాటు సచిన్‌.. నీకు కూడా చుక్కలు చూపించిన విషయాన్ని మర్చిపోయావా..?’ అంటూ పలువురు అభిమానులు అక్తర్‌పై విరుచుకుపడ్డారు. అయితే కొంతమంది మాత్రం అక్తర్‌ను సమర్థిస్తున్నారు. అక్తర్ మంచి బౌలర్ అని సచిన్ కూడా ఒప్పుకున్నారని, అయితే క్రమశిక్షణారాహిత్యం కారణంగా అతడు గొప్ప క్రికెటర్ కాలేకపోయాడని, అంతమాత్రాన అతడి ప్రతిభను తక్కువ చేయాల్సిన పనిలేదని కొందరు నెటిజన్లు అతడికి అండగా నిలిచారు.
" style="height: 250px;">





పెళ్లికి ముందు సెక్స్ పై అంజ‌లి షాకింగ్ కామెంట్స్..!

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>