PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinashb42db1f5-3dd2-4704-bea3-628341ab57b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/devineni-avinashb42db1f5-3dd2-4704-bea3-628341ab57b4-415x250-IndiaHerald.jpgదేవినేని అవినాష్...ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో ఒకరు. తన తండ్రి దేవినేని నెహ్రూ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్...కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు. యువనాయకుడుగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు.devineni avinash;nani;jeevitha rajaseskhar;amarnath cave temple;vijayawada;andhra pradesh;congress;devineni avinash;2019;east;mla;cheque;service;yuva;ycp;father;dookudu;partyఈ సారి దేవినేని ఫిక్స్ చేసుకున్నట్లేనా..!ఈ సారి దేవినేని ఫిక్స్ చేసుకున్నట్లేనా..!devineni avinash;nani;jeevitha rajaseskhar;amarnath cave temple;vijayawada;andhra pradesh;congress;devineni avinash;2019;east;mla;cheque;service;yuva;ycp;father;dookudu;partyThu, 01 Apr 2021 01:00:00 GMT

దేవినేని అవినాష్...ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువ నాయకుల్లో ఒకరు. తన తండ్రి దేవినేని నెహ్రూ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్...కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు. యువనాయకుడుగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.  అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు.


అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అయినా సరే 2014లో అవినాష్ కాంగ్రెస్ తరుపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ జీవితం ఉండదని చెప్పి, తన తండ్రి నెహ్రూతో కలిసి టీడీపీలోకి వచ్చారు. అయితే మధ్యలో నెహ్రూ మరణించారు. ఇక ఆ తర్వాత అవినాష్ టీడీపీలో తెలుగు యువత అధ్యక్షుడుగా పనిచేశారు.


అలాగే అధినేత చంద్రబాబు మాట కాదనకుండా 2019 ఎన్నికల్లో ఓడిపోయే గుడివాడ సీటులో పోటీ చేశారు. ఇక అక్కడ నాని చేతిలో అవినాష్ ఓటమి పాలయ్యారు. ఓడిపోయినా సరే పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూనే వచ్చారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ ముందుకు కదిలారు. అయితే అవినాష్ ఇలా దూకుడుగా ఉంటూ పార్టీలోని కొందరు పెద్దలకు నచ్చలేదు. దీంతో అవినాష్‌ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.


ఇక ఇలాంటి రాజకీయం తట్టుకోలేక అవినాష్ వైసీపీలోకి వచ్చేశారు. వైసీపీలోకి రావడం రావడమే విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్ పదవి దక్కించుకున్నారు. పదవి వచ్చిన దగ్గర నుంచి అవినాష్, నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేశారు. తక్కువ కాలంలోనే తూర్పులో టీడీపీకి చెక్ పెట్టేసి వైసీపీ పుంజుకునేలా చేశారు.


అలాగే ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడమే రెండు సార్లు ఓటమి పాలైన అవినాష్, ఈ సారి మాత్రం విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. విజయవాడ తూర్పులో ఈ సారి అవినాష్ గెలుపు ఫిక్స్ అని తెలుస్తోంది. 





ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?

వకీల్ సాబ్ ఓవర్ సీస్ లో ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుందంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>