Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/blind-cricketc6010019-ee8e-4ad3-a6af-22de7bfe79e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/blind-cricketc6010019-ee8e-4ad3-a6af-22de7bfe79e2-415x250-IndiaHerald.jpgభారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే కరోనా కారణంగా ఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగి ఏడాది కావస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. ప్రస్తుతం దాయాది జట్ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించబోతోందనే వార్త నెట్టింట..blind cricket;cricket;india;pakistan;bangladesh;icc t20;aprilభారత్, పాక్, బంగ్లాదేశ్ ట్రై సిరీస్ కన్‌ఫర్మ్.. ఏప్రిల్ 2 నుంచి..భారత్, పాక్, బంగ్లాదేశ్ ట్రై సిరీస్ కన్‌ఫర్మ్.. ఏప్రిల్ 2 నుంచి..blind cricket;cricket;india;pakistan;bangladesh;icc t20;aprilThu, 01 Apr 2021 22:09:43 GMTఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే కరోనా కారణంగా ఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగి ఏడాది కావస్తుంది. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. ప్రస్తుతం దాయాది జట్ల మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించబోతోందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. అయితే ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ట్రై సిరీస్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ట్రై సిరీస్ మూడు దేశాల బ్లైండ్ క్రికెట్ జట్ల మధ్య జరగనుంది.

ఇందులో మూడు దేశాలు ఆడనున్నా అందరి దృష్టి భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య సజరిగే మ్యాచ్‌ల పైనే ఉంది. ఈ ఫార్మాట్ లో అసలైన పోటీ దాయాదుల మధ్య ఉండనుంది. ఈ ట్రై-సిరీస్ ఏప్రిల్ 2 నుండి 8 వరకు నడుస్తుంది. ఈ టీ 20 సిరీస్‌లో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు మూడో జట్టుగా బంగ్లాదేశ్‌ ఆడనుంది. ఈ ఫార్మాట్ మొత్తం ఢాకాలో జరుగుతాయి. ఈ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఇందులో ఏప్రిల్‌ 4 న  భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య సిరీస్‌లో తొలి ఎన్‌కౌంటర్‌ జరగనున్నట్లు కౌన్సిల్ అధికారి తెలిపారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.

ఈ సిరీస్ పై పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అధికారి మాట్లాడుతూ.. ‘టీ20 సిరీస్‌లో పాల్గొననున్న ఆటగాళ్లందరూ కరోనా పరీక్ష చేయించుకున్నారు. వీటి ఫలితాలన్నీ నెగెటివ్ రిపోర్టులే వచ్చాయి. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు కూడా కరోనా నెగెటివ్ వచ్చాయని తెలిపారు. సిరీస్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 న ప్రారంభ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ముఖాముఖి తలపడనుండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏప్రిల్ 3 న తలపడనున్నాయి. ఏప్రిల్ 4 న భారత్, పాకిస్తాన్ జట్లు ఒకరినొకరు ఢీ కొట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఏప్రిల్ 5 విశ్రాంతి దినం ఆపై ఏప్రిల్ 6 న పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య పోటీ ఉంటుంది. ఏప్రిల్ 7 న భారత జట్టు మరోసారి పాకిస్థాన్‌తో తలపడనుంది. మొదటి రెండు జట్ల మధ్య ఏప్రిల్ 8 న టైటిల్ మ్యాచ్ జరుగుతుంది.


తిరుపతిలో బూమరాంగ్ అయ్యేదెవరికి...?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>