Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/kolkata-knight-riders-player-gets-corona-positive0defd20c-1a7f-4eb5-b141-5df1c23efd77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/kolkata-knight-riders-player-gets-corona-positive0defd20c-1a7f-4eb5-b141-5df1c23efd77-415x250-IndiaHerald.jpg కరోనా మహమ్మారికి బెదరకుండా ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. బయోబబుల్ వాతావరణంలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు. మరో 8 రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది. ఏ ఆటగాడూ కరోనా బారిన పడకుండా ఆయా ఫ్రాంచైజీలన్నీ..ipl 2021;rana;yajamanya;goa;mumbai;delhi;bcci;twitter;april;marchస్టార్ ఆటగాడికి కరోనా.. ఆందోళనలో కేకేఆర్..స్టార్ ఆటగాడికి కరోనా.. ఆందోళనలో కేకేఆర్..ipl 2021;rana;yajamanya;goa;mumbai;delhi;bcci;twitter;april;marchThu, 01 Apr 2021 21:17:02 GMTఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారికి బెదరకుండా ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. బయోబబుల్ వాతావరణంలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొనబోతున్నారు. మరో 8 రోజుల్లో టోర్నీ ప్రారంభం కానుంది. ఏ ఆటగాడూ కరోనా బారిన పడకుండా ఆయా ఫ్రాంచైజీలన్నీ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉన్నట్లుండి కోల్‌కతా నైట్ రైడర్స్‌ స్టార్ ఆటగాడికి కరోనా పాజిటివ్ సోకడం తాజాగా కలకలం సృష్టిస్తోంది. ఆ జట్టు కీలక ఆటగాడు నితీశ్ రాణాకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఫ్రాచైజీ ట్విటర్ వేదికగా తాజాగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

నితీశ్ రాణా మార్చి 19న జట్టు శిబిరంలో చేరాడని, అయితే అతడిని మిగతా ఆటగాళ్లతో పాటు 7 రోజుల క్వారంటైన్‌లో ఉంచామని జట్టు యాజమాన్యం తెలిపింది. క్వారంటైన్ సమయంలో అనేకసార్లు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేస్తామని, అలాగే మార్చి 22న నితీశ్ రాణాకు కరోనా పరీక్ష చేయగా.. అందులో కరోనా పాజిటివ్ తేలిందని కేకేఆర్ వెల్లడించింది. అయితే అతడిలో ఎలాంటి లక్షణాలూ లేవని, అతడి ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో నిలకడగా ఉందని జట్టు యాజమాన్యం తెలిపింది.

కాగా.. ఇటీవల ముగిసిన దేశవాళీ టోర్నీల్లో నితీశ్ రాణా ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు రోజుల కిందట గోవా ట్రిప్‌ నుంచి తిరిగి వచ్చాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు రిపోర్ట్ చేసే సమయంలో అతనికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఓ ప్రైవేటు హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉంటున్నాడు. అయితే అతనికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం.

ఇదిలా ఉంటే కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. గత నాలుగు ఐపీఎల్ సీజన్‌లుగా రాణా కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తరపున నితీశ్ బరిలోకి దిగాడు.

" style="height: 250px;">






బాబుకి ప్రామిస్ చేసిన టీడీపీ నేతలు

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>