Healthsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/baruvu-taggadaniki-menthulu-upayogapadataya9be44e69-acd5-4a70-b986-efa1204512a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/baruvu-taggadaniki-menthulu-upayogapadataya9be44e69-acd5-4a70-b986-efa1204512a4-415x250-IndiaHerald.jpgమెంతి గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. menthulu;iron;vitamin;sugar;cholesterol;nijam;cinnamon;zeroబరువు తగ్గడానికి మెంతులు ఉపయోగపడతాయా..?బరువు తగ్గడానికి మెంతులు ఉపయోగపడతాయా..?menthulu;iron;vitamin;sugar;cholesterol;nijam;cinnamon;zeroThu, 01 Apr 2021 07:00:00 GMTఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.                                  


పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు. అయినప్పటికీ చాలామందిలో నిరాశే కనిపిస్తుంటుంది. అయితే బరువు తగ్గేందుకు మన వంట గదిలోనే అనేక ఔషధాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే అలాంటి ఔషధాల్లో మెంతులు ఒకటి. మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.


అయితే నిపుణులు మెంతులు కోసం మనకి అనేక విషయాలు చెప్పారు. దీనిలో ఉండే పదార్థాలు బరువు తగ్గడానికి మరియు కొవ్వు తగ్గించడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రతి రోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక దీనిని రెగ్యులర్ డైట్ లో తీసుకున్నారు అంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరు నిజంగా దీనిని ఉపయోగించారు అంటే మీకు అనేక లాభాలు ఉంటాయి. పైగా బరువు తగ్గడం కూడా సులభం.


 ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం పూట దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. బరువు తగ్గడానికి సులువుగా ఉదయాన్నే ఇలా చేయొచ్చు. దీని కోసం మీరు రాత్రే మెంతులు తీసుకొని నీళ్ళ లో నానబెట్టండి. మర్చి పోకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తీసుకోండి. ఈ మెంతులని మీరు రాత్రి నానపెట్టాలి. పూర్తిగా రాత్రి అంతా నాన బెట్టిన తర్వాత దీన్ని నీళ్లలో మారగపెట్టొచ్చు. ఆ తర్వాత వడకట్టేసి తీసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి కలుగుతుంది. కొవ్వు కూడా తగ్గి పోతుంది. పైగా దీని వల్ల మీకు జీరో క్యాలరీలు మాత్రమే అందుతాయి.


మెంతులతో టీ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్. మీరు ఏదైనా తక్కువ కేలరీలు ఉన్న డ్రింకులు తీసుకోవాలంటే తప్పకుండా దీనిని ప్రిఫర్ చేయండి. పైగా ఇది కొవ్వును తగ్గిస్తుంది కాబట్టి తాగడం చాలా మంచిది. నిజంగా దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే మెంతులు టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.


దీని కోసం మీరు కొద్దిగా మెంతులు తీసుకోండి. అల్లం, దాల్చిన చెక్క, కొద్దిగా మెంతులు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో నీళ్లు పోసి అల్లం, మెంతులు, దాల్చిన చెక్క వేసి మరిగించండి. ఐదు నిమిషాల వరకు మరిగిన తర్వాత కొద్దిగా పంచదార వేసుకుంటే వేసుకో వచ్చు లేదంటే లేదు. ఇలా దీన్ని తయారు చేసుకోవాలి అల్లం మరియు దాల్చిన చెక్క బరువు తగ్గడానికి ఉపయోగ పడతాయి. విటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది రోజుకి రెండు నుంచి మూడు సార్లు మీరు దీనిని తీసుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది.


మెంతులు బరువు తగ్గడానికి అలానే న్యూట్రియంట్స్ అందించడానికి ఉపయోగ పడతాయి అయితే బాగా లాభం ఉంటుందని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. సరిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ తక్కువ వద్దు. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు పైగా వేడి కూడా చేస్తాయి. కాబట్టి రెండునుంచి మూడు గ్రాములు మాత్రమే తీసుకోవడం మంచిది. ఎక్కువగా తీసుకోకండి. ఏదైనా మితంగా తీసుకుంటే పని చేస్తుంది ఈ విషయాన్నీ గమనించండి.

కాబట్టి అదే చేయండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా లిమిట్ గా తీసుకోండి. బరువు తగ్గడానికి బాగా పని చేస్తాయి అలానే ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి తక్కువ తీసుకోండి. రెగ్యులర్ గా మీ డైట్ లో వీటిని తీసుకోండి. అలానే ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం చేస్తూ ఉండండి.. వీటిని ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా బరువు తగ్గుతుంది. అలానే మెంతులని తీసుకోవడం వలన మన ఒంట్లో వుండే కొవ్వు ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన కొలతల్లో ఇక్కడ చెప్పిన పద్ధతుల్లో మెంతుల్ని తీసుకోండి. దీని వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి పైగా ఆరోగ్యం కూడా బాగుంటుంది.


రాస‌లీల‌ల కేసులో ఏం జ‌రిగింద‌నేది మొత్తం చెప్పిన ఆ యువ‌తి

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?

అక్కడ టీడీపీకి పవన్ కావాల్సిందేనా?

తాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు మమత పెద్ద షాక్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>