PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/apsrtc-in-revenue-hike-after-corona-effectfe546aad-3159-455d-9f1d-da5739ceb633-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/apsrtc-in-revenue-hike-after-corona-effectfe546aad-3159-455d-9f1d-da5739ceb633-415x250-IndiaHerald.jpg నష్టాల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని కరోనా మరింత దిగజార్చింది.లాక్‌డౌన్‌తో ఆదా యం గణనీయంగా తగ్గింది. డీజిల్‌ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల ఇబ్బందుల మాటెలా ఉన్నా.. ఆర్టీసీకి మాత్రం గుదిబండగా మారుతోంది. పెరుగుతున్న డీజిల్‌ రేట్ల కారణంగా సంస్థపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్టీసీ రూ.2800 కోట్ల నష్టాల్లో ఉంది. మరోవైపు కొత్త పీఆర్సీ వేతనాల కోసం కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్‌ రేట్ల పెరుగుదల ఆర్టీసీకిrtc;review;adah sharma;yajamanya;telangana;rtc;busఆర్టీసీకి దిన‌దిన గ‌డం.... ప్ర‌భుత్వం కూడా చేతులెత్తేస్తోందిగా..!ఆర్టీసీకి దిన‌దిన గ‌డం.... ప్ర‌భుత్వం కూడా చేతులెత్తేస్తోందిగా..!rtc;review;adah sharma;yajamanya;telangana;rtc;busThu, 01 Apr 2021 09:10:47 GMTనష్టాల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని కరోనా మరింత దిగజార్చింది.లాక్‌డౌన్‌తో ఆదా యం గణనీయంగా తగ్గింది. డీజిల్‌ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల ఇబ్బందుల మాటెలా ఉన్నా.. ఆర్టీసీకి మాత్రం గుదిబండగా మారుతోంది. పెరుగుతున్న డీజిల్‌ రేట్ల కారణంగా సంస్థపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే ఆర్టీసీ రూ.2800 కోట్ల నష్టాల్లో ఉంది. మరోవైపు కొత్త పీఆర్సీ వేతనాల కోసం కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్‌ రేట్ల పెరుగుదల ఆర్టీసీకి శరాఘాతంగా మారింది. చాలా వ‌ర‌కు స‌ర్వీసుల‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం ఆర్టీసీ ధైన్య స్థితికి నిద‌ర్శ‌న‌మ‌నే చెప్పాలి. లాక్‌డౌన్ త‌ర్వాత ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు, ఆక్యుపెన్సీ రేష్యూ ఎదిగినా, కార్గో సేవలను ప్రవేశపెట్టి నా పాత అప్పులు గుదిబండగా మారాయి.


ఈ తరుణంలో నూతన బస్సులను కొనలేక పోతున్న యాజమాన్యం పాత బస్సులకు కొత్త హంగులతో అలంకరిస్తోంది. లక్షలాది కిలోమీటర్లు ప్రయాణిం చి మొరాయిస్తున్న బస్సులకు తాత్కాలిక మరమ్మతులతో రూట్లలో తిప్పుతోంది. అంతేగాక స్పేర్‌స్పార్ట్స్‌ అందుబాటులో ఉంచలేకపోతోంది.కరోనా కంటే ముందు నుంచి పేరుకుపోయిన బకాయిల భారం మాత్రం కరోనాతో మరింత రెట్టింపు అయింది. సాధారణంగా రోజుకు 13 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా.. ప్రస్తుతం 9 కోట్లు మాత్రమే వస్తోంది. అంటే నెలకు 3 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోలిస్తే.. 150 నుంచి 200 కోట్ల ఆదాయం తగ్గింది.


కరోనా కష్టాలు, పాత అప్పుల నుంచి తెలంగాణ ఆర్టీసీ కొంతైనా బయటపడాలంటే.. ప్రభుత్వం చేసే సహాయంతో పాటు మరోసారి చార్జీలు పెంచితేనే.. కొంతైనా ఆర్థిక ఉప శమనం లభిస్తుందంటున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. అందులో భాగంగానే ఆర్టీసీ రివ్యూలో చార్జీల పెంపు అంశాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రభుత్వం చేదోడువాదోడుగా ఉన్నా.. ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. చార్జీల పెంచితేనే మంచిదని భావిస్తున్నాయి ఆర్టీసీ వర్గాలు.



నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>