PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-imrankhan13b847e2-7645-4a5a-a2e0-6f55205c450c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-imrankhan13b847e2-7645-4a5a-a2e0-6f55205c450c-415x250-IndiaHerald.jpgమొన్న ఆ మధ్య పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. పాపం.. ఆయన కరోనా టీకా వేయించుకున్నా ఆ కరోనా ఇమ్రాన్ ఖాన్ ను వదల్లేదు.. ఆయన వేయించుకుంది చైనా టీకా కావడం వల్లనే అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇమ్రాన్ ఖాన్ కు కరోనా వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కోలుకోవాలంటూ ఓ లేఖ రాశారు. పాకిస్తాన్ డే కూడా కలిసొచ్చినందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పాక్ ప్రధాన మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ఇమ్రాన్ లేఖ రాశారు. తన ఆరోగ్యmodi-imrankhan;modi;imran khan;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;narendra modi;prime minister;letter;narendraనరేంద్ర మోడీని ఇమ్రాన్ ఖాన్‌ బెదిరిస్తున్నాడా..?నరేంద్ర మోడీని ఇమ్రాన్ ఖాన్‌ బెదిరిస్తున్నాడా..?modi-imrankhan;modi;imran khan;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;narendra modi;prime minister;letter;narendraThu, 01 Apr 2021 08:10:02 GMTమొన్న ఆ మధ్య పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. పాపం.. ఆయన కరోనా టీకా వేయించుకున్నా ఆ కరోనా ఇమ్రాన్ ఖాన్ ను వదల్లేదు.. ఆయన వేయించుకుంది చైనా టీకా కావడం వల్లనే అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఇమ్రాన్ ఖాన్ కు కరోనా వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన కోలుకోవాలంటూ ఓ లేఖ రాశారు. పాకిస్తాన్ డే కూడా కలిసొచ్చినందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పాక్ ప్రధాన మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ఇమ్రాన్ లేఖ రాశారు.

తన ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ కృతజ్ఞతలు చెబుతూనే.. తన బుద్ది పోనిచ్చుకోకుండా కొన్ని వంకర మాటలు కూడా వదిలాడు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ జమ్మూకాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. భారత్- పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.

స్వేచ్ఛా, సామర్థ్యాలతో కూడిన స్వతంత్ర్య, సార్వభౌమ రాజ్యానికి ముందుచూపుతో పునాదులు వేసిన మా జాతి పితలను గుర్తు చేసుకుని, నివాళులు అర్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఇమ్రాన్ తెలిపారు. భారత్ సహా పొరుగు దేశాలన్నిటితోనూ పాకిస్తాన్ ప్రజలు శాంతి, పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదాలు, జమ్మూ కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరత సాధ్యం అవుతాయని తెలిపారు. చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. చూడటానికి బాగానే ఉన్నా.. ఇమ్రాన్ ఖాన్ జమ్ము కాశ్మీర్ అంశాన్ని కెలకడం ద్వారా మరోసారి ఇమ్రాన్ ఖాన్ తన బుద్ది బయట పెట్టుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాస్తే కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ మోడీని బెదిరిస్తున్నారా అన్న వాదన వినిపిస్తోంది.  





మమతా బెనర్జీపై మరోదాడి?

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుమలపైన ఎల్లోమీడియా ఇంత విషం చిమ్ముతోందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>