Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli8486e59d-c588-452c-91d3-bb8566eeb26c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohli8486e59d-c588-452c-91d3-bb8566eeb26c-415x250-IndiaHerald.jpg క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే క్రీడల్లో ఒకటి. ఈ ఆటకు ఎందరో వీరాభిమానులు ఉన్నారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా అన్ని మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఎనిమిది నెలల సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ మళ్లీ పుంజుకుంది. కాని కరోనా భయంతో ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉండాలన్న..virat kohli;amala akkineni;virat kohli;cricket;bcci;international‘నీ సూచన పట్టించుకోం’.. విరాట్‌కు షాకిచ్చిన బీసీసీఐ‘నీ సూచన పట్టించుకోం’.. విరాట్‌కు షాకిచ్చిన బీసీసీఐvirat kohli;amala akkineni;virat kohli;cricket;bcci;internationalThu, 01 Apr 2021 18:12:29 GMTఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించే క్రీడల్లో ఒకటి. ఈ ఆటకు ఎందరో వీరాభిమానులు ఉన్నారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా అన్ని మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఎనిమిది నెలల సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ మళ్లీ పుంజుకుంది. కాని కరోనా భయంతో ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉండాలన్న నిబంధనను అధికారులు అమలు చేశారు.

అయితే ఇటీవల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిపై స్పందించారు. సుదీర్ఘకాలం బయో బబుల్‌లో ఉండడం ఆటగాళ్లకు అత్యంత కష్టమనీ.. ఇదేవిధంగా కొనసాగితే రానున్న మ్యచుల్లో ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం పడుతుందని కాబట్టి అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఖరారుపై బీసీసీఐ పునరాలోచించుకోవాలంటూ విరాట్‌ కోహ్లీ సూచించారు.

అయితే కోహ్లీ చేసిన సూచనను బీసీసీఐ తిరస్కరించింది. కోహ్లీ సూచనలు సరైనవే అయినా వ్యాపార భాగస్వాములను దృష్టిలో ఉంచుకొని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సూచనను పాటించడం కుదరదని బోర్డు ఖరాఖండిగా తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘కోహ్లీ ఆందోళన సరైందే. కానీ, ఇందుకున్న ప్రత్యామ్నాయాలను చాలా తక్కువ.


కేవలం రెండు పద్దతులను మాత్రమే పాటించగలం. వాటిలో ఒకటి రొటేషన్‌ పద్దతి. రెండోది అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించడం. ఈ రెండింటిని అమలు చేయడం మనకు అంత సులభం కాదు. వీటితో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి’ అని ఆ అధికారి తెలిపారు. అంతేకాకుండా బయో బబుల్‌ పద్ధతి కారణంగానే ఆటగాళ్లకు కరోనా సోకకుండా నియంత్రించగలుగుతున్నమని అన్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ మొదలుకానుండగా ఈ చర్చలు జరగడం అభిమానుల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అయితే ఈ నెల 9వ తారీకు నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ పూర్తిగా బయోబబుల్ వాతావరణంలో జరగనుంది. అలాగే స్టేడియాలకు ప్రేక్షకులను కూడా బీసీసీఐ అనుమతించడం లేదు. అంటే పూర్తిగా ఖాళీ స్టేడియంలలో ఈ టోర్నీ ఆసాంతం జరగనుంది. కాగా.. అనేకమంది విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే బయోబబుల్ వాతావరణాన్ని భరించలేక టోర్నీకి దూరమవుతున్నారు.



షర్మిలకు కొత్త పేరు పెట్టిన అరవింద్

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి

సాగర్ లో ఏరులై పారుతున్న లిక్కర్.. ఇదిగో ఇదే సాక్షం..?

వకీల్ సాబ్ కథలో పవన్ హ్యాండ్ ?

ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరానికి పోస్టుపోన్ కాబోతుందా??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>