Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/harbajan-shocking-comments-on-playing-cricket-at-the-age-of-402cbc05f3-0710-4219-a788-4531eed3f397-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/harbajan-shocking-comments-on-playing-cricket-at-the-age-of-402cbc05f3-0710-4219-a788-4531eed3f397-415x250-IndiaHerald.jpgవ్యక్తిగత కారణాల వల్ల గతేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్న భజ్జీని చెన్నై సూపర్‌ కింగ్స్‌ వదులుకుంది. దీంతో ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో నిలిచిన హర్బజన్ సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్జ్ జట్టు అతడి కనీస ధర రూ.2 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌ నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్‌ జట్టుకు..harbajan singh;praveen;rani;mumbai;cricket;audi;mini;rajasthan;2019;job;chennai;international;punjabi;punjab;v;chris morris‘ఆ అవసరం నాకు లేదు’.. హర్బజన్ షాకింగ్ కామెంట్స్‘ఆ అవసరం నాకు లేదు’.. హర్బజన్ షాకింగ్ కామెంట్స్harbajan singh;praveen;rani;mumbai;cricket;audi;mini;rajasthan;2019;job;chennai;international;punjabi;punjab;v;chris morrisThu, 01 Apr 2021 21:39:37 GMTఇంటర్నెట్ డెస్క్: వ్యక్తిగత కారణాల వల్ల గతేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్న భజ్జీని చెన్నై సూపర్‌ కింగ్స్‌ వదులుకుంది. దీంతో ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో నిలిచిన హర్బజన్ సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్జ్ జట్టు అతడి కనీస ధర రూ.2 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌ నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ పంజాబీ స్పిన్నర్‌ 2018, 2019 సీజన్లలో చెన్నైకు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 700కుపైగా వికెట్లు తీసుకున్న భజ్జీ.. తాను ప్రాతినిధ్యం వహించిన ఆఖరి సీజన్‌లో(2019) 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించి శభాష్‌ అనిపించాడు. భజ్జీ తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 160 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు సాధించాడు.

కాగా.. తాజగా హర్బజన్ 40వ ఏట అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇంత వయసులో ఇంకా క్రికెట్ ఆడాల్సిన అవసరమేంటని కొందరు నెటిజన్లు భజ్జీపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై హర్బజన్ మండిపడ్డాడు. తనకు ఎప్పుడేం చేయాలో తెలుసని తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని ఘాటు రిప్లై ఇచ్చాడు. తనకు ఆడాలనిపించినన్ని రోజుల పాటు క్రికెట్‌ ఆడుతానని, ఎందరేమన్నా పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.

`నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు తరఫున మంచి ప్రదర్శన చేయడమే నా ముందున్న లక్ష్యం. అనవసరపు చర్చలపై స్పందించి టైమ్‌ వేస్ట్‌ చేసుకోదలుచుకోలేదు. నా కంటూ కొన్ని ప్రమాణాలు నెలకొల్పుకున్నా. వాటిని అందుకోలేకపోతే నన్ను నేనే నిందించుకుంటా.

40 ఏళ్ల వయసులో ఎలా ఆడాలో నాకు తెలుసు. కోల్‌కతాకు మంచి జట్టుంది. అద్భుతమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నార`ని భజ్జీ చెప్పుకొచ్చాడు. అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు తరఫున వంద శాతం పర్ఫార్మ్‌ చేయడమే తన ముందున్న లక్ష్యమని, అనవసరపు చర్చలపై స్పందించి, తన టైమ్‌ను వేస్ట్‌ చేసుకోదలుచుకోలేదని విహర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో నలభై ఏళ్ల వయసులో ఉన్నవారు మరికొందరు కూడా ఉన్నారు. విండీస్ సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ పంజాబ్ తరపున బరిలోకి దిగుతుంటే.. స్పిన్నర్ ప్రవీణ్ తాంబే రాజస్థాన్ తరపున ఆడాడు. అలాగే ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా నాలుగు పదుల వయసులోనూ ఐపీఎల్‌లో ఆడి రాణించాడు. మరి భజ్జీ విషయంలో విమర్శకులకు ఈ ప్రత్యేక ఇంటరెస్ట్ ఏంటో అర్థం కావడం లేదు.


తిరుపతిలో బూమరాంగ్ అయ్యేదెవరికి...?

కేరళలో కషాయం తాగుతున్న పార్టీ ?

టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్.. ఆ హీరోతో కలిసి..?

పాపం.... ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలన్నీ ఆ మూవీ మీదనే .... సక్సెస్ అవుతుందా .....??

పవన్ కోసమే ఈ సినిమా చేసాను.. 'వకీల్ సాబ్' సినిమా మెయిన్ పాయింట్ అదే : వేణు శ్రీరామ్

"ఆర్ ఆర్ ఆర్" ని ఆ రేంజిలో బాలీవుడ్ లో విడుదల చేస్తారట.....

లోకేష్ వ్యాఖ్యలు ఏంటీ...? మరీ ఇలా ఉన్నాయి




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>