MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thalaivi-movie-updates18c2d31a-9cd7-48f9-a25f-7ac5b2d2c36b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thalaivi-movie-updates18c2d31a-9cd7-48f9-a25f-7ac5b2d2c36b-415x250-IndiaHerald.jpgతమిళనాడు ప్రజలంతా అమ్మగా పిలుచుకున్న జయలలితకు వారి నుండి ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పే విషయం కాదు. ఆమె బ్రతికున్నంత కాలం ప్రజల కోసమే పాటుపడింది. అందుకే మన దేశంలో ఏ నాయకురాలికీ లేనంత గుర్తింపును గౌరవాన్ని ప్రజల నుండి పొందగలిగింది. ఈమె భౌతికంగా వారి మధ్య లేకున్నా నిరంతరం ఆమె బ్రతికుందనే ఆశతోనే ఎంతో మంది ప్రజలు ఉన్నారు. THALAIVI MOVIE UPDATES;allu aravind;bhagyashree;kangana ranaut;madhubala;arvind swamy;jayalalitha;jeevitha rajaseskhar;tara;vijay;vijay a l;india;bollywood;cinema;chief minister;thalaivi;wife;gv prakash;joseph vijay;singer;posters;samuthirakani;chitramతలైవి నుండి ఫస్ట్ సాంగ్ "ఇలా ఇలా" ...!తలైవి నుండి ఫస్ట్ సాంగ్ "ఇలా ఇలా" ...!THALAIVI MOVIE UPDATES;allu aravind;bhagyashree;kangana ranaut;madhubala;arvind swamy;jayalalitha;jeevitha rajaseskhar;tara;vijay;vijay a l;india;bollywood;cinema;chief minister;thalaivi;wife;gv prakash;joseph vijay;singer;posters;samuthirakani;chitramThu, 01 Apr 2021 09:00:00 GMTతమిళనాడు ప్రజలంతా అమ్మగా పిలుచుకున్న జయలలితకు వారి నుండి ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పే విషయం కాదు. ఆమె బ్రతికున్నంత కాలం ప్రజల కోసమే పాటుపడింది. అందుకే మన దేశంలో ఏ నాయకురాలికీ లేనంత గుర్తింపును గౌరవాన్ని ప్రజల నుండి పొందగలిగింది. ఈమె భౌతికంగా వారి మధ్య లేకున్నా నిరంతరం ఆమె బ్రతికుందనే ఆశతోనే ఎంతో మంది ప్రజలు ఉన్నారు. అంతలా వారికి కనెక్ట్ అయింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. నిజ జీవిత కథలు కాబట్టి ప్రజలు చూడడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి మన నిర్మాతలు ఇలాంటి ప్రాజెక్టులను తెరకెక్కిస్తుంటారు.

అదే విధంగా ప్రస్తుతం దివంగత నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుండి ఇప్పటి వరకు ప్రజల్లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాకు తలైవి అనే టైటిల్ ను పెట్టారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగన్ రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నామని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తలైవి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ అన్నీ కూడా ప్రజల్లో మంచి స్పందనను రాబట్టుకోగలిగాయి. ఇందులో కంగనా నటనను ఎంతోమంది సినీ ప్రముఖులు అభినందించారు.  తాజాగా ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సినిమా నుండి "ఇలా ఇలా...." అనే పల్లవితో సాగే పాటను ఏప్రిల్ 2 వతేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించగా....సిరాశ్రీ సాహిత్యాన్ని అందించారు. స్వయంగా జీవీ ప్రకాష్ భార్య గాయని సైంథవి ప్రకాశ్ ఈ గీతాన్ని ఆలపించారు. దీనికి బృందాగోపాల్ కొరియోగ్రఫీ చేశారు. ఇకపోతే ఈ చిత్రంలో ఎంజిఆర్ గా అరవింద్ స్వామి నటించగా, కరుణానిధిగా సముద్రఖని నటించారు. జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ.. జానకీ రామచంద్రన్ గా మధుబాల నటించారు. ఈ సినిమాకు ఏ ఎల్ విజయ్ దర్శకుడిగా బాధ్యతలను నిర్వర్తించాడు. ఈ సినిమా ఏప్రిల్ 23 వతేదీన అత్యంత వైభవంగా విడుదల కానుంది. మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



ఆర్టీసీకి దిన‌దిన గ‌డం.... ప్ర‌భుత్వం కూడా చేతులెత్తేస్తోందిగా..!

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

కాబోయే సీఎం సువేందునే... వాళ్లు తేల్చేస్తున్నారుగా...

కమ్మ నేత మీద బిజెపి మొగ్గు..?

హెరాల్డ్ సెటైర్ : బీజేపీ అభ్యర్ధిది చాలా ఇంట్రస్టింగ్ స్టోరీ

ఆచార్య సాంగ్ కు అదరకొట్టిన చిరు... ఆడేసుకుంటున్న నెటిజన్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>