Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purush645d32a4-36a4-42f2-87b2-4a5312d4a468-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adi-purush645d32a4-36a4-42f2-87b2-4a5312d4a468-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలadi purush;prabhas;aly khan;saif ali khan;ali;kriti sanon;ramu;rajamouli;india;adinarayanareddy;bollywood;cinema;telugu;bahubali;saaho;hindi;industry;makeup;local language;nijam;racchaశ్రీరామనవమి స్పెషల్ గా ప్రభాస్ ఆది పురుష్ ఫస్ట్ లుక్...?శ్రీరామనవమి స్పెషల్ గా ప్రభాస్ ఆది పురుష్ ఫస్ట్ లుక్...?adi purush;prabhas;aly khan;saif ali khan;ali;kriti sanon;ramu;rajamouli;india;adinarayanareddy;bollywood;cinema;telugu;bahubali;saaho;hindi;industry;makeup;local language;nijam;racchaThu, 01 Apr 2021 03:00:00 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్  ఇండియా స్టార్ అయిపోయాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.  బాహుబలి సిరీస్‌తో  ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది.  బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నఈ సినిమా నార్త్‌లో మాత్రం ఇరగదీసింది.


అయితే ప్రభాస్’ నేషనల్ స్టార్ అయ్యాక శ్రీరాముడి పాత్రలో నటిస్తోన్నాడని వార్తలు రాగానే.. నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో ఆ వార్త బాగా వైరల్ అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ “ఏ- ఆది పురుష్” వస్తోంది. దానికి తోడు బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్ డేట్ తెలుస్తోంది. శ్రీరామనవమి స్పెషల్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. శ్రీరామనవమి అంటే వచ్చే నెల 21. మరి 21న ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే శ్రీ రాముడి భక్తులకు ఆ రోజున ఒక స్పెషల్ డే అని చెప్పాలి. అన్నట్టు రాముడి పట్టాభిషేకం జరిగే సందర్భంలో స్టిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. నిజంగానే ఈ సినిమా నుండి ఆ స్టిల్ గానీ రిలీజ్ అయితే ఇక ఇండియా వైడ్ గా సోషల్ మీడియాలో రచ్చ మొదలైనట్టే.


ఇక ఈ సినిమాలో కృతి సనన్ సీతగా నటిస్తోంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం సైఫ్ ఉన్న ఎత్తు కంటే ఇంకాస్త ఎత్తుగా ఉన్నట్టు చూపించడం కోసం స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను వాడబోతున్నారట. ఇక టి సిరీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ మొత్తంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు. మొత్తానికి భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమాగా ఈ సినిమాని మలచాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.


తాడిపత్రి పాలిటిక్స్: మళ్ళీ టర్న్ అవుతుందా?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>