MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajucdfa51e9-b89c-4fbb-ba74-69b3fbc9bd1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajucdfa51e9-b89c-4fbb-ba74-69b3fbc9bd1e-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గురించి తెలియని వారంటూ ఉండరు. అగ్ర నిర్మాతలలో ఒకరిగా దిల్ రాజు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో దిల్ రాజు కేవలం చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. కానీ ప్రస్తుతం దిల్ రాజు చిన్న సినిమాలతో పాటు భారీ చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. Dil Raju;pawan;prabhas;ram charan teja;allu arjun;arya;kalyan;pawan kalyan;prasanth;prashanth neel;raj;ram pothineni;shankar;india;cinema;producer;director;producer1;hero;kgf;prasanth neel;duvvada jagannadham;arjun 1;prashant kishor;dil;aryaa;chitramఫామ్ లోకి వచ్చిన దిల్ రాజు.. వరుసగా ఆ హీరోలతోనే సినిమాలు..!ఫామ్ లోకి వచ్చిన దిల్ రాజు.. వరుసగా ఆ హీరోలతోనే సినిమాలు..!Dil Raju;pawan;prabhas;ram charan teja;allu arjun;arya;kalyan;pawan kalyan;prasanth;prashanth neel;raj;ram pothineni;shankar;india;cinema;producer;director;producer1;hero;kgf;prasanth neel;duvvada jagannadham;arjun 1;prashant kishor;dil;aryaa;chitramThu, 01 Apr 2021 12:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గురించి తెలియని వారంటూ ఉండరు. అగ్ర నిర్మాతలలో ఒకరిగా దిల్ రాజు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో దిల్ రాజు కేవలం చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. కానీ ప్రస్తుతం దిల్ రాజు చిన్న సినిమాలతో పాటు భారీ చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. వరుసగా భారీ సినిమాలను నిర్మించడమే కాకుండా ఆ చిత్రాలను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నిర్మాత. ఈ క్రమంలోనే దిల్ రాజు బ్యానర్ లో భారీ సినిమాలను తీసుకువస్తున్నారు.

తాజాగా మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ తేజ్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను దిల్ రాజు పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 130 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం.

ఇకపోతే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సలార్ సినిమాను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు.ఇవే కాకుండా మరో రెండు పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడం కోసం దిల్ రాజు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అల్లుఅర్జున్ తో మరో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఆర్య, పరుగు, డీజే వంటి సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో దిల్ రాజు నాలుగో సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఇన్ని పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడం అంటే చిన్న విషయం కాదు.కానీ ఈ విధమైన భారీ చిత్రాలను నిర్మించడం కేవలం దిల్ రాజ్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.



సిఎంను అవమానిస్తున్న బిజెపి... మిత్రపక్షం అయినా...?

ఆదిపురుష్ మూవీ కోసం ఏకంగా అడవినే సృష్టించారు...!

తిరుపతి లో బీజేపీ అతి పెద్ద రాంగ్ స్టెప్ ?

జగన్ నిర్ణయాలు.. ఒక తరాన్ని మార్చేస్తాయా..?

నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

పాపం సురేందర్ రెడ్డి... ఆశలు పెట్టుకున్న సినిమా నిరవధిక వాయిదా !

ట్రెండింగ్‌లో చిరంజీవి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>