PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-197e3790a8-b10d-4888-8abc-d334642aad00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-197e3790a8-b10d-4888-8abc-d334642aad00-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 684 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. ఈ సంవత్సరంలో ఒక్క రోజుల్లో నమోదైన కరోనా కేసుల్లో ఇదే రికార్డ్.covid 19;mohandas karamchand gandhi;panjaaతెలంగాణలో రికార్డ్ కరోనా కేసులు!తెలంగాణలో రికార్డ్ కరోనా కేసులు!covid 19;mohandas karamchand gandhi;panjaaWed, 31 Mar 2021 11:03:49 GMTపంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 684 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. ఈ సంవత్సరంలో ఒక్క రోజుల్లో నమోదైన కరోనా కేసుల్లో ఇదే రికార్డ్. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,965 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,873 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 184 మందికి క‌రోనా సోకింది. తెలంగాణలో మంగళవారం 56,122 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు మెరుగైన చికిత్స అందించి, ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటోంది. పాజిటివ్‌లు అందరికీ ఒకేచోట కాకుండా, తీవ్రతను బట్టి వేర్వేరు చోట్ల చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. గాంధీ ఆస్పత్రిలో సీరియస్‌ రోగులను మాత్రమే చేర్చుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వైరస్‌ సోకినవారిని అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేనివారిని చేర్చుకోవద్దని నిర్ణయించారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా ఓపీ, శాంపిళ్ల సేకరణ చేపట్టారు.

గాంధీలో ప్రస్తుతం కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ కేసులకు వేర్వేరుగా చికిత్సలు అందిస్తున్నారు. వైరస్‌ బాధితులకు 200 ఐసీయూ పడకలుండగా.. కొత్తగా 100 ఏర్పాటు చేయనున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు చెప్పారు. మరోవైపు ఈ నెల మొదటి వారంలో గాంధీలో 50లోపు కేసులుండగా ప్రస్తుతం 120కి పెరిగారు. పాజిటివ్‌లలో మైల్డ్‌, మోడరేట్‌ కేసులను కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రి, గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఊపిరితిత్తులు, ఇతర శ్వాసకోశ సంబంధిత కేసులను ఛాతీ ఆస్పత్రికి పంపనున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో మంగళవారం నాటికి 126 మంది వైరస్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.




బన్నీ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది.. ఈ కోపాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసా..??

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>