PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-latest-news800ab3f3-2315-4a0c-add9-9e445086a2e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-jagan-latest-news800ab3f3-2315-4a0c-add9-9e445086a2e1-415x250-IndiaHerald.jpgఅతను కలలు కన్నాడు.. పట్టుదలతో ఓదార్పు యాత్ర చేశాడు.. లక్ష్యం చేరలేదు.. అయినా అదరలేదు.. బెదరలేదు.. మళ్లీ ప్రయత్నించాడు.. తన కలలను సాకారం చేసుకున్నాడు.. ఆయనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలలు కన్నారు.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ycp, jagan, latest news;amaravati;andhra pradesh;high court;vishakapatnam;capital;court;chief minister;central government;supreme court;yatra;amaravathiఅమరావతి to విశాఖపట్నం సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీస్అమరావతి to విశాఖపట్నం సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీస్ycp, jagan, latest news;amaravati;andhra pradesh;high court;vishakapatnam;capital;court;chief minister;central government;supreme court;yatra;amaravathiWed, 31 Mar 2021 11:48:35 GMTఅతను కలలు కన్నాడు.. పట్టుదలతో ఓదార్పు యాత్ర చేశాడు.. లక్ష్యం చేరలేదు.. అయినా అదరలేదు.. బెదరలేదు.. మళ్లీ ప్రయత్నించాడు.. తన కలలను సాకారం చేసుకున్నాడు.. ఆయనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కలలు కన్నారు.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరాజధాని ఉంటే సరిపోదు.. మూడు రాజధానులుండాలి.. ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది.. ఇసుక లేకపోయినా.. కొత్త కంపెనీలు రాకపోయినా.. ఉద్యోగాల సృష్టి జరగకపోయినా విశాఖ‌ప‌ట్నం వెళితే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందనుకున్నారు. ఆ దిశగా అడుగు వేస్తున్నారు.

ఒక సామాజిక‌వ‌ర్గం కోస‌మే అమ‌రావ‌తి
అమరావతిని కేవలం ఓ సామాజిక వర్గం కోసమే నిర్మాణం చేశారన్న ముఖ్యమంత్రి దాన్ని బూచిగా చూపి విశాఖపట్నం వెళ్లిపోవడానికి శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదేం చిత్రమో రెండు సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా అంగుళం కూడా కదల్లేకపోతున్నామనిపిస్తోంది. క‌ర్నూలు న్యాయ‌రాజ‌ధాని అంతే. శాస‌న‌, న్యాయ‌, పాల‌నా రాజ‌ధానులు ఎంత బాగున్నాయి విన‌డానికి. ఒక‌టే రాజధాని ఉండాలంటూ అమ‌రావ‌తి రైతులు ఉద్యమిస్తున్నారు.

మే 6వ తేదీకి వెళ్లిపోవాలి
ఎన్ని అడ్డంకులు వచ్చినా.. నిర్ణయించిన ముహూర్తం మే 6వ తేదీకి అక్కడికి వెళ్లిపోవాల‌ని సీఎం భావిస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న విమానాల సంఖ్య 43 నుంచి 58కి పెంచారు. ఈ సంఖ్య పెంచేలా కొద్దికాలం క్రిత‌మే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినట్టు తాజాగా తెలిసింది. న‌గ‌రంలో కీలక రహదారులను భారీగా విస్తరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అనువైన భవనాల ఎంపిక కూడా పూర్తయిన‌ట్లు స‌మాచారం. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు నిరంతరం అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి. మౌలిక సౌకర్యాల కల్పనకు ఎన్ని నిధులు కావాలన్నా ప్రభుత్వం విడుద‌ల చేస్తోంది. హైకోర్టులో ప్ర‌స్తుతం జరుగుతున్న విచారణ తుదిదశకు చేరుకునే లోపే విశాఖలో 50 శాతం పాలన ప్రారంభం కావాలి. లేదంటే... సుప్రీం కోర్టులో కీలక న్యాయమూర్తులు మారే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాజ‌ధాని  మార్చ‌డం సాధ్యం కాద‌నేది ముఖ్య‌మంత్రి అభిప్రాయంగా ఉంది. త్వ‌ర‌లోనే సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అవుతార‌ని భావిస్తున్న జ‌స్టిస్‌ను దృష్టిలో ఉంచుకొనే రాజ‌ధాని మార్చ‌డానికి శ‌ర‌వేగంగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.





జగన్ ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందే...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>