EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-triangle-love-story-going-on-between-these-three-parties-as-ycp-mp-said0ce8c8d6-175c-4947-acb0-98f0b3b13275-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-triangle-love-story-going-on-between-these-three-parties-as-ycp-mp-said0ce8c8d6-175c-4947-acb0-98f0b3b13275-415x250-IndiaHerald.jpgరాజకీయంగా ఒకళ్ళపై మరొకళ్ళు ఏవేవో ఆరోపణలు, విమర్శలు చేసుకోవటం మామూలే. కొన్నిసార్లు అవి సృతిమించిపోతాయి కూడా. కానీ విజయాసాయి మాత్రం కొన్నిసార్లు వ్యగ్యంగా ఎక్కువయినా హద్దులు మాత్రం దాటవనే చెప్పాలి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కూడా ఎప్పటినుండో పై మూడుపార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారాలనే ఆవిష్కరించింది. 2019 ఎన్నికల్లో తగిలిన దారుణమైన దెబ్బ తర్వాత మళ్ళీ నరేంద్రమోడికి దగ్గరవ్వాలని చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నంలేదు. మోడి అసలు తనవైపు చూడకపోయినా ఏదో రూపంలో మళ్ళీ ఎన్డీయేలో చేరాలని చంద్రబాబు తెగ ప్రయత్నిస్తునnaidu somu pawan tdp janasena bjp vijayasai ycp mp;pawan;cbn;tiru;bharatiya janata party;jagan;janasena;2019;mp;tirupati;cm;twitter;love;husband;tdp;ycp;janasena party;nijam;love storyహెరాల్డ్ ఎడిటోరియల్ : నిజంగానే వాళ్ళమధ్య ఇంత స్టోరీ నడుస్తోందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : నిజంగానే వాళ్ళమధ్య ఇంత స్టోరీ నడుస్తోందా ?naidu somu pawan tdp janasena bjp vijayasai ycp mp;pawan;cbn;tiru;bharatiya janata party;jagan;janasena;2019;mp;tirupati;cm;twitter;love;husband;tdp;ycp;janasena party;nijam;love storyWed, 31 Mar 2021 03:00:00 GMTరాష్ట్రంలో టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందా ? వినటానికే విచిత్రంగా ఉన్నా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి తాజాగా అలాగే చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాలో పై మూడుపార్టీల గురించి ఎద్దేవా చేశారు. విజయసాయి తాజాగా చేసిన ట్విట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటి ? ట్వీట్ లో ఏముందంటే ‘ప్రజా విశ్వాసంకోల్పోయిన రెండుపార్టీల డ్రామానంతా జనాలు చూస్తున్నారు. బీజేపీ చంకలో దూరాలని పచ్చపార్టీ ఆరాటం. వీర్రాజుగారేమో పవనే సీఎం అని తేల్చేశారు. తనకేమో బాబుని ఇంకోసారి సీఎంగా చూడాలని కోరిక. ట్రాయంగిల్ లవ్ స్టోరీ లాగ లేదు’ ? అంటు విజయసాయి ఎద్దేవాచేశారు.




రాజకీయంగా ఒకళ్ళపై మరొకళ్ళు ఏవేవో ఆరోపణలు, విమర్శలు చేసుకోవటం మామూలే. కొన్నిసార్లు అవి సృతిమించిపోతాయి కూడా. కానీ విజయాసాయి మాత్రం కొన్నిసార్లు వ్యగ్యంగా ఎక్కువయినా హద్దులు మాత్రం దాటవనే చెప్పాలి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కూడా ఎప్పటినుండో పై మూడుపార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారాలనే ఆవిష్కరించింది. 2019 ఎన్నికల్లో తగిలిన దారుణమైన దెబ్బ తర్వాత మళ్ళీ నరేంద్రమోడికి దగ్గరవ్వాలని చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నంలేదు. మోడి అసలు తనవైపు చూడకపోయినా ఏదో రూపంలో మళ్ళీ ఎన్డీయేలో చేరాలని చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే మోడిపై పల్లెత్తుమాట కూడా అనటంలేదు.




ఇక పవన్ విషయానికి వస్తే ఎంతసేపు చంద్రబాబును కాపాడటమే టార్గెట్ గా పనిచేస్తున్నాడనే ఆరోపణలకు కొదవేలేదు. 2019 ఎన్నికలకు ముందుగానీ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునేంతవరకు చంద్రబాబు జేబులో మనిషిగా చెలామణి అవటానికే పవన్ కష్టపడుతున్నట్లు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో రోడ్డుషోల్లో పవన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయద్దని చెప్పటం అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కు ఓట్లేయద్దని పవన్ చెప్పటంలో అర్ధమేంటో. ఇక తిరుపతి ఉపఎన్నికలో డిపాజిట్ తెచ్చుకుంటే బీజేపీకి అదే గెలిచినంత. అందుకు పవన్ సహకారం లేకపోతే సాధ్యంకాదని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే కాబోయే సీఎం పవనే అంటు ఓ బిస్కట్ వేసేశారు. అవసరార్ధమే పవన్ను బీజేపీ మునగచెట్టెక్కిస్తోందన్న విషయం అర్ధమైపోయింది. ఇవన్నీ గమనించిన తర్వాతే విజయసాయి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్లున్నారు.




కంచుకోటలో టీడీపీకి కష్టాలు...ఆ మాజీ మంత్రి సెట్ చేసుకుంటారా?

పాపం బండ్ల గణేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా.. ఈసారి వచ్చి రాని ఇంగ్లీష్ తో..??

ఆమె కేంద్ర మంత్రి...ఈయన ముఖ్యమంత్రి... జనాల సంగతేంటి...

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>