PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-kcr73a69737-72da-4c7f-b67d-077f224f35b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-kcr73a69737-72da-4c7f-b67d-077f224f35b6-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు వైయస్ షర్మిల. ముఖ్యమంత్రి జిల్లాగా చెప్పుకునే మెదక్ లో 20 కరవు మండలాలు ఉండటం బాధాకరమని అన్నారు. జిల్లాలోని పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోందని విమర్శించారు.ys sharmila kcr;kcr;telangana;y. s. rajasekhara reddy;district;police;chief minister;arogyasri;khammam;medak;partyసీఎం జిల్లాలో కరువా.. కేసీఆర్ పై షర్మిల ఫైర్సీఎం జిల్లాలో కరువా.. కేసీఆర్ పై షర్మిల ఫైర్ys sharmila kcr;kcr;telangana;y. s. rajasekhara reddy;district;police;chief minister;arogyasri;khammam;medak;partyWed, 31 Mar 2021 20:05:53 GMTపార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల మరింత దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు షర్మిల. ముఖ్యమంత్రి జిల్లాగా చెప్పుకునే మెదక్ లో 20 కరవు మండలాలు ఉండటం బాధాకరమని అన్నారు. జిల్లాలోని పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోందని విమర్శించారు. మల్లన్నసాగర్ కి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని... వారు ఆందోళనబాట పట్టారని అన్నారు. దళితుల భూములను లాక్కొంటున్నారని దుయ్యబట్టారు. మెదక్ జిల్లా వైయస్సార్ అభిమానులతో ఈరోజు ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల అన్నారు. పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరి పోసిన గద్దర్ పుట్టిన గడ్డ మెదక్ అని చెప్పారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మెదక్ నుంచే ప్రారంభమైందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా 5.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని వైయస్ భావించారని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటి పాలకులు ప్రీడిజైన్ చేసి, ఏం చేశారో తెలియదని అన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో  వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వైఎస్ఆర్ అభిమానులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల.. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీంతో జిల్లాల సమావేశాలు ముగిశాయి. దీంతో ఇకపై షర్మిల పార్టీ ఆవిర్భావ సభపై ఫోకస్ చేయనున్నారు.  ఖమ్మంలో ఏప్రిల్ 9న సంకల్ప సభను తలపెట్టారు వైఎస్ షర్మిల. కానీ కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఐతే తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. జనం గుంపులు గుంపులుగా ఉండకూడదని స్పష్టం చేసింది.ఈ క్రమంలో కోవిడ్ ఆంక్షల ప్రభావం షర్మిల సభపై పడే అవకాశముంది.


తెలంగాణా ప్రజలకు విద్యుత్ శాఖ గుడ్ న్యూస్

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>