PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-mp-by-elections5d830c47-ae0e-465f-a6ba-19400a4c452a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-mp-by-elections5d830c47-ae0e-465f-a6ba-19400a4c452a-415x250-IndiaHerald.jpgతిరుపతి ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేస్తున్న అభ్యర్థులలో మరియు ఆయా రాజకీయ పార్టీలలో టెన్షన్ నెలకొంది. నామినేషన్ ముగియడంతో ప్రచారాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. TIRUPATI-MP-BY ELECTIONS;pawan;kalyan;prasanna;tiru;bharatiya janata party;janasena;mp;tirupati;parliment;husband;ycp;janasena party;partyపవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ ప్రాంతాలలో రోడ్ షో చేయాల్సిందే...?పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ ప్రాంతాలలో రోడ్ షో చేయాల్సిందే...?TIRUPATI-MP-BY ELECTIONS;pawan;kalyan;prasanna;tiru;bharatiya janata party;janasena;mp;tirupati;parliment;husband;ycp;janasena party;partyWed, 31 Mar 2021 14:00:00 GMTతిరుపతి ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోటీ చేస్తున్న అభ్యర్థులలో మరియు ఆయా రాజకీయ పార్టీలలో టెన్షన్  నెలకొంది. నామినేషన్ ముగియడంతో ప్రచారాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. వైసీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు వైసీపీ నాయకులు. అయితే ఇక్కడ వైసీపీ ఊహించినంత సులభంగా విజయం దక్కకపోవచ్చు. దీనికి రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నా, ఒక విషయంలో మాత్రం వీరు వెనుకబడి ఉన్నారని చెప్పాలి. అదేమిటంటే వైసీపీ తరపున  పోటీలో ఉన్న అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడం మరియు ప్రజల్లో పెద్దగా పేరున్న వ్యక్తి కూడా కాకపోవడం ప్రతికూలతగా మారే అవకాశం ఉంది.

అయితే ఇవన్నీ పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉండబోవని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇదంతా ఇలా ఉంటే, తిరుపతి ఎంపీ ఉప ఎన్నికకు బీజేపీ - జనసేన కూటమి కలిసి వెళుతున్న విషయం తెలిసిందే. ఎంపీ అభ్యర్థిగా బీజేపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ రత్న ప్రభని నిలబెట్టడం జరిగింది. దీనికి జనసేన పార్టీ బలపరిచింది. అంతే కాకుండా త్వరలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రచారానికి రానున్నారనని జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా తిరుపతిలో పాదయాత్ర కూడా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఎంఆర్ పల్లి నుండి శంకరంబాడి సర్కిల్ వరకు ఈ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇంత వరకు బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి ఇటువంటి సందర్భంలో కేవలం తిరుపతి వరకు పాదయాత్ర చేయడం వలన పెద్దగా ఉపయోగం ఉండబోదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో కనీసం రోడ్ షో అయినా చేయాల్సిన అవసరముందని చెబుతున్నారు. అప్పుడే బీజేపీ-జనసేన కూటమికి ప్లస్ అవుతుందని సలహాలు ఇస్తున్నారు. ఈ విషయం గురించి ఇరు పార్టీలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని వారి అభిప్రాయం. అలా కానీ పక్షంలో ఈ ఎన్నికల్లో మీరు నిమిత్త ఫలితంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా ఈ ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటాడో తెలియాల్సి ఉంది.



పోలవరం ప్రాజెక్ట్ పై ఎన్జీటి పిటిషన్..కారణం అదేనా..!!

మరణానంతరం ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్న నటుడు...!

శిల్పా శెట్టికి తెలుగులో అదిరిపోయే కం బ్యాక్.. రెండు బడా సినిమాల్లో

సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా చేస్తారా..?

ఈ టాలీవడ్ నటులు మంచి క్రీడాకారులనే విషయం మీకు తెలుసా.?

బన్నీ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది.. ఈ కోపాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసా..??

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>