MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/jatiratnalubc380e92-f80f-441e-8dc7-e639bbd3870d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/jatiratnalubc380e92-f80f-441e-8dc7-e639bbd3870d-415x250-IndiaHerald.jpgకరోనా లాంటి మహమ్మారి భయ పెట్టిన తర్వాత కూడా మన తెలుగు వాళ్ళు సినిమా మీద ఏమాత్రం ఆసక్తి తగ్గించలేదు. నెలకు ఒక సినిమా చొప్పున ప్రతి నెల ఒక సినిమా హిట్ చేస్తూ వస్తున్నారు.. అయితే ఈ నెలలో హిట్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమా మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఒకరకంగా ఇది సినిమాలకు అన్ సీజన్ అని చెబుతూ ఉంటారు.. ఇలాంటి సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కోట్ల రూపాయిల కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజుల పాటు కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూలTOLLYWOOD GOSSIPS;tollywood;cinema;telugu;media;youtube;you tubeటాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!టాలీవుడ్ చరిత్రలో జాతిరత్నాలు రికార్డ్ నెవర్ బిఫోర్!TOLLYWOOD GOSSIPS;tollywood;cinema;telugu;media;youtube;you tubeWed, 31 Mar 2021 17:00:00 GMTకరోనా లాంటి మహమ్మారి భయ పెట్టిన తర్వాత కూడా మన తెలుగు వాళ్ళు సినిమా మీద ఏమాత్రం ఆసక్తి తగ్గించలేదు. నెలకు ఒక సినిమా చొప్పున ప్రతి నెల ఒక సినిమా హిట్ చేస్తూ వస్తున్నారు.. అయితే ఈ నెలలో హిట్ గా నిలిచిన జాతిరత్నాలు సినిమా మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఒకరకంగా ఇది సినిమాలకు అన్ సీజన్ అని చెబుతూ ఉంటారు.. ఇలాంటి సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కోట్ల రూపాయిల కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజుల పాటు కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూలు చేసిన ఈ సినిమా అమెరికాలో కూడా అరుదైన రికార్డులు సంపాదిస్తూ ముందుకు వెళుతోంది. 

ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రమోషన్ విషయంలో ఈ సినిమా మరో రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేసుకుంది. మీడియా, డిజిటల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ చానల్స్ ఇలా దేన్నీ వదలకుండా జాతి రత్నాలు అనే పదాన్ని వీళ్ళు జనాల్లోకి తీసుకు వెళ్లగలిగారు. అయితే మరో ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.. అదేమిటి అంటే తెలుగులో యూట్యూబర్స్ చేత ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేయించింది. అంటే వాళ్లు ప్రమోషన్ చేస్తున్నారని కూడా జనానికి అర్థం కాకుండా ప్రమోషన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది..

మిగతా భాషల వాళ్లతో పోలిస్తే తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ చాలా చిన్నది. కరోనా సమయంలో ఖాళీగా ఉండే చాలామంది యూట్యూబర్స్ గా మారారు. అలాగే అంతకు ముందు నుంచి ఉన్న యూట్యూబర్స్ తో కలిపి ఇప్పుడు జాతిరత్నాలు ప్రమోషన్స్ గట్టిగా చేసినట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు సినిమా చూడమని నేరుగా చెప్పకుండా ఆ యూట్యూబర్స్ తమ వీడియోలో ఈ జాతి రత్నాలు పేరు ప్రస్తావిస్తూ జాతి రత్నాలు పేరుతో థంబ్ నెయిల్స్ పెడుతూ ఎవరికీ అర్థం కాని విధంగా ప్రమోట్ చేసినట్లు చెబుతున్నారు. ఇలా రకరకాలుగా ప్రమోషన్ చేయడంతోనే ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది అనే వాదనా లేకపోలేదు.




కడప స్టీల్ ప్లాంట్ కు ఆ కంపెనీ కాదా...?

ఏ క్షణం అయినా రాజధాని మారొచ్చు: బొత్సా

లోకేష్ కు ఇంత ధీమా ఏంటో...?

ముద్దు సీన్స్ కి నో చెబుతున్న నివేదా పేతురాజ్..

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

రెండో పెళ్లి పై స్పందించిన నాగబాబు.. నాకు ఓకే అంటూ సమాధానం.. ఫ్యాన్స్ షాక్..?

వకీల్ సాబ్ ఓవర్ సీస్ లో ఎన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుందంటే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>