PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumarf6b4737d-245f-4286-8dc3-6e9895892277-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-ramesh-kumarf6b4737d-245f-4286-8dc3-6e9895892277-415x250-IndiaHerald.jpgతాను రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లి పొరపాటు చేయబోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ. రాజకీయ రంగ ప్రవేశం అన్నది ఉండబోదని నిమ్మగడ్డ తేల్చిపారేశారు. nimmagadda ramesh kumar;kumaar;jagan;andhra pradesh;high court;panchayati;local language;marchపొలిటికల్ ఎంట్రీపై నిమ్మగడ్డ క్లారిటీపొలిటికల్ ఎంట్రీపై నిమ్మగడ్డ క్లారిటీnimmagadda ramesh kumar;kumaar;jagan;andhra pradesh;high court;panchayati;local language;marchWed, 31 Mar 2021 11:44:03 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తన నిర్ణయాలతో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఎస్ఈసీ పవర్ ఏంటో చూపించారు. పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నిమ్మగడ్డదే పై చేయి అయింది. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన నిమ్మగడ్డ... మార్చి 31తో పదవి విరమణ చేశారు. విధుల్లో చివరి రోజు కావడంతో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ... పలు అంశాలపై తన మనోభావాలను పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎస్ నీలం సాహ్నీకి అభినందనలు తెలియజేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లానని చెప్పారు.  ప్రభుత్వ సహకారం, సీఎస్, డీజీపీలతో పాటు ఉద్యోగులు అందించిన తోడ్పాటుతో స్థానిక ఎన్నికలను విజయవంతం చేశామని చెప్పిన ఆయన, సమయం ఉంటే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించి వుండేవాళ్లమని, అయితే, తనకు అంత సమయం లేకపోయిందని అన్నారు.

తాను రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లి పొరపాటు చేయబోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ. రాజకీయ రంగ ప్రవేశం అన్నది ఉండబోదని నిమ్మగడ్డ తేల్చిపారేశారు.ప్రస్తుత రాజకీయాలు చూసేవారికి సంతృప్తిగా లేదని చెప్పారు. 

తనకు గతంలో తెలంగాణలో ఓటు హక్కు ఉండేదని, దాన్ని స్వగ్రామానికి మార్చుకుందామని భావించానని, తన ఓటును తాను మార్చుకుంటే తప్పేంటని నిమ్మగడ్డ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఒకసారి ఓటు వేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికీ ఉందని, తన హక్కుల సాధనకు ఓ సామాన్య పౌరుడిగా రేపటి నుంచి పోరాడతానని చెప్పారు. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు నిమ్మగడ్డ




జగన్ ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందే...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ సీఎం డైలాగ్ రివ‌ర్స్ అయ్యిందే ?

బాబు అలా.. నేత‌లు ఇలా... టీడీపీ మ‌రోసారి ప్లాప్ ప్లాన్ ?

ఎల్లో మీడియాధినేత ఆక్రోషం ప‌ట్ట‌లేక‌పోతున్నారా ?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో పనబాక రికార్డు బ్రేక్.. ఏమిటో తెలుసా ?

రష్మిక వేలికి ‘రింగ్’! ఎంగేజ్మెంట్ అయిపోయిందా ?

చైనా కోసం పాకిస్తాన్ తన ప్రజలను కరోనాకు బలి పెడుతోందా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>