KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/budugu-these-foods-are-dangerous-for-children-do-not-give-at-allbd0d4de2-a5b3-4575-bfc3-1b21e0e264f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/budugu-these-foods-are-dangerous-for-children-do-not-give-at-allbd0d4de2-a5b3-4575-bfc3-1b21e0e264f1-415x250-IndiaHerald.jpgతల్లిదండ్రులు పిల్లల ఆహార విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారికీ కొన్ని పెట్టకూడని ఆహారపదార్దాలు కూడా ఉంటాయి అవి ఏంటో చూద్దామా. చాలామంది తాము కోలా డ్రింక్స్ తాగుతున్నప్పుడు పిల్లలు అడిగితే వారికి కూడా పోసి ఇస్తూ ఉంటారు. వాటిలో క్యాలరీలు చాలా ఎక్కువ. చక్కెర కూడా ఎక్కువ. childrens;heart;oilబుడుగు: పిల్లలకు ఈ ఫుడ్స్ ప్రమాదకరం... అస్సలు ఇవ్వొద్దు..!బుడుగు: పిల్లలకు ఈ ఫుడ్స్ ప్రమాదకరం... అస్సలు ఇవ్వొద్దు..!childrens;heart;oilTue, 30 Mar 2021 17:00:00 GMT
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్లు, క్యాండీలంటే ఇష్టం. ఇంకొందరు బబుల్ గమ్స్ కూడా తింటుంటారు. కానీ దీనివల్ల వారు అనుకోకుండా వాటిని మింగేస్తే వారి గొంతులో అవి ఇరుక్కుపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు లాలీపాప్స్ తినడం ద్వారా ఎక్కువ సమయం పాటు చక్కెర పళ్లకు దగ్గరగా ఉంటూ పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వీలైనంత తక్కువగా వారికి ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక పిల్లలకు చిన్నతనంలో అస్సలు కారం లేకుండా ఆహారం పెడుతుంటాం. తర్వాత కొద్దికొద్దిగా కారం పెంచుతూ మామూలు ఆహారం అలవాటు చేస్తాం. అయితే పిల్లలకు ఎక్కువ కారం, ఎక్కువ నూనె ఉన్న పదార్థాలను పెట్టకపోవడం మంచిది. కారం ఎక్కువ ఉన్న ఆహారం పెట్టడం వల్ల అది వారి పేగుల గోడలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే నూనె ఎక్కువగా ఉన్న వస్తువులు తినడం వల్ల వారికి అరుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వంటివి ఎదురవుతాయి.

అలాగే జామ, యాపిల్ లాంటి పండ్లు కూడా. ద్రాక్ష పండ్లను కూడా వారికి అలాగే ఇవ్వకూడదు. వీటిని ఒకవేళ వారికి ఇవ్వాలనుకుంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి అందించాలి. వారు నమలకుండా మింగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. పెద్దగా ఉన్న ముక్కలు పెట్టకుండా చూసుకోవాలి.

పిల్లలకు నట్స్, సీడ్స్ వారి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే వీలైనంత వరకూ వీటిని వారికి దూరంగా ఉంచాలి. ఎందుకంటే వారికి అప్పుడప్పుడే పళ్లు వస్తుంటాయి. వీటిని నమలడం వారికి ఇబ్బందవుతుంది. దీంతో అలాగే మింగేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల అవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.


సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ టీజర్ డేట్ వచ్చేసింది...

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

వకీల్ సాబ్ ట్రైలర్ లాంఛ్ లో ఫ్యాన్స్ రచ్చ.. థియేటర్ లో అభిమానులకి గాయాలు..!!

కమల్ హాసన్ మేకప్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన ఆ సినిమా విశేషాలు మీకోసంమీకు తెలుసా..!

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>