HealthGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/latest-newsd894ff58-6185-47bc-a74d-94dd31d8317a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/latest-newsd894ff58-6185-47bc-a74d-94dd31d8317a-415x250-IndiaHerald.jpgమనదేశంలో మాంసాహారం తినేవారి సంఖ్య ఎంతుందో వీధివీధికీ వెలుస్తోన్న బిర్యానీ పాయింట్లే చెబుతాయి. మాంసాహారమంటే కోడి, పొట్టేలు, చేప, రొయ్య, పీత... ఇలా చాలా వస్తాయి. కొన్నిదేశాల్లో అయితే ఇంకా ఏమేమి తింటారో తెలుసుగా!. మనదేశంలో చికెన్ ను ఇష్టపడినంతగా మటన్ ను ఇష్టపడరు. కానీ చికెన్ కన్నా మటన్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో సుగుణాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు నుంచి మూడుసార్లు మటన్‌ను ఆహారంగా తీసుకుంటే ఎన్ని లాభాలున్నాయో ఒకసారి చూద్దాం! latest news;kanna lakshminarayana;vitamin;chicken;sugar;cholesterol;fish;manadesamమీరు మటన్ తింటున్నారా?... అయితే ఒక్కసారి..మీరు మటన్ తింటున్నారా?... అయితే ఒక్కసారి..latest news;kanna lakshminarayana;vitamin;chicken;sugar;cholesterol;fish;manadesamTue, 30 Mar 2021 07:47:09 GMTచేప, రొయ్య, పీత... ఇలా చాలా వస్తాయి. కొన్నిదేశాల్లో అయితే ఇంకా ఏమేమి తింటారో తెలుసుగా!. మనదేశంలో చికెన్ ను ఇష్టపడినంతగా మటన్ ను ఇష్టపడరు. కానీ చికెన్ కన్నా మటన్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో సుగుణాలున్నాయని ఒక పరిశోధనలో తేలింది. ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు నుంచి మూడుసార్లు మటన్‌ను ఆహారంగా తీసుకుంటే ఎన్ని లాభాలున్నాయో ఒకసారి చూద్దాం!

కొవ్వును క‌రిగిస్తుంది
మటన్‌లో బి1, బి2, బి3, బి9, బి12 విటమిన్లుంటాయి. విటమిన్-ఇ, కె కూడా ఉండటమ‌నేది మ‌ట‌న్ తినేవారికి అద‌న‌పు లాభం.   ఇందులో శ‌రీరానికి బాగా అవ‌స‌ర‌మైన ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, బి 12 ఎక్కువగా ఉండటం వలన శరీరంలో అనవసరంగా ఉండే కొవ్వును కరిగించడంలో ఇవి సహాయం చేస్తాయి.  బి 12 ఎక్కువగా ఉండటం వలన శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి మ‌ట‌న్ స‌హాయ‌ప‌డుతుంది. దెబ్బతిన్న రక్తకణాల స్థానాల్లో కొత్తవి ఏర్పాటు  చేయడానికి దోహ‌ద‌పడుతుంది. మటన్‌ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గర్భిణులకు మంచి ప్ర‌యోజ‌నాలున్నాయి.

గుండెపోటును దూరం చేస్తుంది
అలానే మటన్ ను ఆహారంగా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఎక్కువ‌గా కాకుండా త‌గిన మోతాదులో తీసుకుంటుంటే టైప్ 2 డయాబెటిస్, ఇతర వ్యాధుల నుంచి బయటపడొచ్చ‌ని తేలింది. ఇందులో పొటాషియం, తగిన మోతాదులో సోడియం ఉండటంవ‌ల్ల‌ గుండెపోటు, రక్తపోటు, మూత్రపిండాల సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ‌ లెక్కల ప్రకారం రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ జంతు మాంసం తిన‌కూడ‌దు. వారానికి 350 గ్రాముల కంటే ఎక్కువ మాంసం తిన‌కూడ‌ద‌ని సూచించింది. ముఖ్యంగా నూనెల వేయించిన  మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తినకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే వండుకొని తింటే పైన చెప్పిన లాభాల‌న్నీ మ‌ట‌న్‌వ‌ల్ల పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

 


చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?

ఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>