PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/muncipal-elections9c0cd9e0-beae-4de6-9eb3-687ed7e71d42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/muncipal-elections9c0cd9e0-beae-4de6-9eb3-687ed7e71d42-415x250-IndiaHerald.jpgరాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే పురపాలక ఎన్నికల సందడి ముగిసింది. దాదాపు అన్నిచోట్లా వైసీపీ విజయభేరి మోగించింది. అంతా ఓకే.. కానీ ఇకపై ఏం జరుగుతుంది. పురపాలక ఎన్నికలు అచ్చమైన స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రజలకు బాగా అందుబాటులో ఉండే వ్యవస్థ మున్సిపల్ ఎన్నికల వ్యవస్థ. ఈ వ్యవస్థ సక్రమంగా పని చేస్తే.. ప్రజాసమస్యలు చాలా వరకూ పరిష్కారం అవుతాయి. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే కొత్తగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్లకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే ఈ శిక్షణmuncipal-elections;botcha satyanarayana;minister;local language;ycpఎన్నికలు ముగిశాయి సరే.. అన్నింటి కంటే ముందు ఈ పని చేయాలి..!?ఎన్నికలు ముగిశాయి సరే.. అన్నింటి కంటే ముందు ఈ పని చేయాలి..!?muncipal-elections;botcha satyanarayana;minister;local language;ycpTue, 30 Mar 2021 08:00:00 GMTవైసీపీ విజయభేరి మోగించింది. అంతా ఓకే.. కానీ ఇకపై ఏం జరుగుతుంది. పురపాలక ఎన్నికలు అచ్చమైన స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రజలకు బాగా అందుబాటులో ఉండే వ్యవస్థ మున్సిపల్ ఎన్నికల వ్యవస్థ. ఈ వ్యవస్థ సక్రమంగా పని చేస్తే.. ప్రజాసమస్యలు చాలా వరకూ పరిష్కారం అవుతాయి. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే కొత్తగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్లకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.


అయితే ఈ శిక్షణ కేవలం మున్సిపల్ ఛైర్‌పర్సన్లకు మాత్రమే పరిమితం చేయకూడదు. అలా చేస్తే సరైన ఫలితాలు రావు. కొత్త గా ఎన్నికైన వార్డు మెంబర్ నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లు అందరికీ తగిన శిక్షణ ఇవ్వాలి. పాలన వ్యవస్థ తీరుపై అవగాహన కల్పించాలి. కౌన్సెలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు ఇలా అందరికీ మున్సిపాలిటీలవారీగానో.. నియోజకవర్గాల వారీగానో.. జిల్లాస్థాయిలోనో.. అందరికీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.


ఎందుకంటే.. ఇందులో చాలా మందికి అసలు పురపాలక సమావేశాలు ఎలా జరుగుతాయి.. తాము ఏం చేయాలన్న అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. పురపాలక సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. అందులో ప్రశ్నలు ఎలా వేయాలి.. సమాధానాలు  ఎలా రప్పించుకోవాలి.. ప్రైవేటు బిల్లులు ఎలా పెట్టాలి.. ఎలా చర్చలో పాల్గోవాలి.. అనే విషయాలపై ముందుగా వీరికి అవగాహన కల్పించాలి. అసలు  సామాన్య ప్రజలు ఎవరికి కంప్లయింట్ చేయాలి.. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎవరు జవాబుదారీగా ఉంటారు అనే విషయాలు ముందుగా వీరికి తెలియాలి.


అదే సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించాలి. ఏ సమస్యకు ఎవరు బాధ్యులో ప్రజలకు తెలియాలి. అప్పుడే జనం కంప్లయింట్ చేస్తారు. దానికి పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి శిక్షణ అటు ప్రభుత్వం తరపునుంచి, ఇటు పార్టీల తరపు నుంచి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. ఈ ఎన్నికలు జరిగినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.




చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?

ఇండియాలోనే టాప్ 2 పర్సన్ గా ఆ హీరో...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>