CrimeN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/suicide0ad1e14a-5657-4c89-b88f-580e55705c7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/suicide0ad1e14a-5657-4c89-b88f-580e55705c7f-415x250-IndiaHerald.jpgసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇక మరోవైపు దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ణికావేశంలో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. suicide;tiru;district;police;nalgonda;mandalam;local language;ranga reddy;central government;uriరంగారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లైన నాలుగు నెలలకే కానిస్టేబుల్‌ ఆత్మహత్య..!?రంగారెడ్డి జిల్లాలో విషాదం.. పెళ్లైన నాలుగు నెలలకే కానిస్టేబుల్‌ ఆత్మహత్య..!?suicide;tiru;district;police;nalgonda;mandalam;local language;ranga reddy;central government;uriTue, 30 Mar 2021 21:06:20 GMT
తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాచారం మండల కేంద్ర శివారులో కానిస్టేబుల్‌ మల్లికార్జున సైదులు(25) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తిరుమలేశుని గుట్ట సమీపంలోని ఓ వెంచర్‌లో చెట్టుకు కానిస్టేబుల్‌ ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా దిండి మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన సైదులు మర్రిగూడెం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. అప్పటి నుంచి దంపతులు మర్రిగూడెంలోనే నివాసం ఉంటున్నారు. పెళ్లై నెలరోజుల పాటు వారి కాపురం ప్రశాంతంగా సాగింది. అంతలోనే భార్యభర్తల మధ్య తరచూ చిన్నపాటి గొడవలు మొదలయ్యాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన సైదులు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

ఇక అక్కడి నుంచి నేరుగా తిరుమలేశుని గుట్ట సమీపానికి వెళ్లిన సైదులు అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న యాచారం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


అదరగొడుతున్న ఆచార్య ప్రోమో సాంగ్....

పాపం బండ్ల గణేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా.. ఈసారి వచ్చి రాని ఇంగ్లీష్ తో..??

ఆమె కేంద్ర మంత్రి...ఈయన ముఖ్యమంత్రి... జనాల సంగతేంటి...

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>