MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-ef84a0d5-fa7f-4810-a377-a6674273bf72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin-ef84a0d5-fa7f-4810-a377-a6674273bf72-415x250-IndiaHerald.jpgహీరో నితిన్ వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరంలో నితిన్ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.Nitin;beauty;venkatesh;nithin;suresh;keerthi suresh;kirti;mahathi;merlapaaka gandhi;nabha natesh;sithara;tamannaah bhatia;mohandas karamchand gandhi;cinema;remake;hero;murder.;posters;june;nithin reddy;venky atluriఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‏లుక్ పోస్టర్!ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‏లుక్ పోస్టర్!Nitin;beauty;venkatesh;nithin;suresh;keerthi suresh;kirti;mahathi;merlapaaka gandhi;nabha natesh;sithara;tamannaah bhatia;mohandas karamchand gandhi;cinema;remake;hero;murder.;posters;june;nithin reddy;venky atluriTue, 30 Mar 2021 11:00:00 GMTహీరో నితిన్ వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ సంవత్సరంలో నితిన్ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే మంగళవారం నితిన్ పుట్టిన రోజు కావడంతో.. ఆయన కొత్త సినిమా టైటిల్‏తోపాటు ఫస్ట్ లుక్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి ‘మాస్ట్రో ‘ అనే పేరును ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించింది నితిన్ టీం. హిందీలో సూపర్ హిట్ సాధించిన అందాదున్ మూవీకి రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఫస్ట్‏లుక్ పోస్టర్‏లో చేతిలో స్టిక్ పట్టుకోని నడుస్తున్నాడు. అంటే ఈ మూవీలో అతను కళ్లు కనపడని వ్యక్తిలా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా.. నితిన్ వెనకాల ఉన్న పియానో పై రక్తపు మరకలు ఉన్నాయి. ఓ కళ్లు కనపడని వ్యక్తి వెనకాల రక్తపు మరకలు ఉండడంతో ఈ వ్యక్తి హత్య చేశాడనే అనుమానం కలిగించేలా పోస్టర్ విడుదల చేసింది యూనిట్. అయితే నితిన్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జె.యువరాజ్ కెమెరామెన్‏గా చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన నితిన్ రంగ్ దే మూవీ అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇందులో నితిన్‏కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.


అందమైన అమ్మగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్...?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

మహేష్ తో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న గురూజీ...

ముహూర్త బ‌లాన్ని న‌మ్ముకున్న వైసీపీ ? ఇదో వింత‌

తిరుప‌తిలో వైసీపీ ఫ‌స్ట్ స్టెప్‌తోనే టీడీపీ బెంబేలు..!‌

టాలీవుడ్ గాస్సిప్స్: పవన్ కళ్యాణ్ తో నటించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పిన రాజీవ్ కనకాల..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>