PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram28f8d79a-d90d-49e3-b750-8317e5306e81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram28f8d79a-d90d-49e3-b750-8317e5306e81-415x250-IndiaHerald.jpgఏపీలో నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అని ఠక్కున చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన గెలిచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజుకో ఊరు తిరుగుతూ, ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ, వాటిని వెంటనే పరిష్కరించడం గానీ, లేదా అధికారులకు చెప్పి త్వరగా పూర్తయ్యేలా చేస్తున్నారు.paritala sreeram;nithya new;sriram;tiru;2019;police;mla;dharmavaram;tdp;paritala ravindra;ycp;raptaduకేతిరెడ్డి విషయంలో శ్రీరామ్‌కు క్లారిటీ వచ్చిందా?కేతిరెడ్డి విషయంలో శ్రీరామ్‌కు క్లారిటీ వచ్చిందా?paritala sreeram;nithya new;sriram;tiru;2019;police;mla;dharmavaram;tdp;paritala ravindra;ycp;raptaduTue, 30 Mar 2021 02:00:00 GMT

ఏపీలో నిత్యం ప్రజల్లో ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అని ఠక్కున చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన గెలిచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రోజుకో ఊరు తిరుగుతూ, ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ, వాటిని వెంటనే పరిష్కరించడం గానీ, లేదా అధికారులకు చెప్పి త్వరగా పూర్తయ్యేలా చేస్తున్నారు.


ఇలా చేస్తుండటంతో న్యూట్రల్‌గా ఉండే ప్రజలు సైతం కేతిరెడ్డిని అభిమానిస్తున్నారు. అయితే కేతిరెడ్డి చేసేవి అన్నీ డ్రామాలు అనే మాట్లాడేవారు కూడా లేకుండా లేరు. ఆయన ఓ కెమెరా, మైక్ పెట్టుకుని ప్రజలని ఆకర్షించేందుకు డ్రామాలు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేతిరెడ్డి ప్రత్యర్ధి, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్, ఈ విషయంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.


2019 ఎన్నికల్లో రాప్తాడులో బరిలో ఓడిపోయిన శ్రీరామ్‌కు చంద్రబాబు, ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి శ్రీరామ్...రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే శ్రీరామ్ రాప్తాడు కంటే ధర్మవరం ఎమ్మెల్యేపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ధర్మవరంలో టీడీపీ నేతలు పెద్దగా నామినేషన్స్ వేయలేకపోయారు.


అయితే కేతిరెడ్డి బెదిరించడంతోనే టీడీపీ అభ్యర్ధులు నామినేషన్స్ వేయలేకపోయారని విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఏది ఎలా జరిగిన ధర్మవరం మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఎన్నికలు ముగిసిన కూడా ధర్మవరంలో హీట్ తగ్గలేదు. తాజాగా శ్రీరామ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారని,   అయితే పోలీసులు రివర్స్‌లో శ్రీరామ్‌పై కేసు పెట్టారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇదంతా కేతిరెడ్డి డైరక్షన్‌లోనే జరుగుతుందని శ్రీరామ్ ఫైర్ అవుతున్నారు. 


పొద్దున్నే ఓ మైక్, కెమెరా వేసుకుని కేతిరెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, ఇదంతా పెద్ద డ్రామా అని విమర్శలు చేస్తున్నారు. కానీ శ్రీరామ్ ఎన్ని విమర్శలు చేసినా, కేతిరెడ్డికి మాత్రం ధర్మవరంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఇక్కడ టీడీపీ చాలా వీక్‌గా ఉంది. ఆ క్లారిటీ శ్రీరామ్‌కు కూడా ఉంది. అందుకే కేతిరెడ్డి ఇమేజ్‌పై దెబ్బ కొట్టాలని విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోందని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. 





అప్పుడే ఆకాశాన్ని అంటిన వకీల్ సాబ్ టికెట్స్ ధరలు......

తిరుపతిలో త్రిముఖం...ఎవరికి లాభం..?

వైసీపీని ఆకట్టుకున్న సోము...?

వైసీపీ నేతలు టీడీపీకి ఎందుకు భయపడుతున్నారు...?

అందరూ చూస్తుండగానే అఖిల్ ని కౌగలించుకున్న మోనాల్ గజ్జర్..

సారంగ ద‌రియా రికార్డు

అటు హీరోకి మరియు డైరెక్టర్ కు స్టార్ హోదా తెచ్చిన సినిమాలేంటో తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>