TVVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/evaru-meelo-koteeswarulu-show-update16d9b08e-6e42-4a98-b745-9e1c5434a39e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/evaru-meelo-koteeswarulu-show-update16d9b08e-6e42-4a98-b745-9e1c5434a39e-415x250-IndiaHerald.jpgటెలివిజన్ రంగంలో ఇప్పటివరకు ఎన్నో రియాలిటీ షో లు గేమ్ షో లు వచ్చాయి. వీటిలో కొన్ని ప్రజల అభిమానాలాలను పొంది సక్సెస్ అయ్యాయి. మరి కొన్ని ప్రజల అంచనాలను అందుకోవడంలో నిరాశ పరిచాయి. వీటిలో ముఖ్యంగా మన భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే గేమ్ షో కి వచ్చినంత ఆదరణ ఏ షో కు రాలేదనే చెప్పాలి. ఈ షో కు వ్యాఖ్యాతగా మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యవహరించారు.EVARU MEELO KOTEESWARULU SHOW UPDATE;chiranjeevi;ntr;amitabh bachchan;nagarjuna akkineni;jr ntr;nageshwara rao akkineni;yajamanya;india;geum;bollywood;tollywood;cinema;telugu;bigboss;television;husband;reality show;letter;success;nandamuri taraka rama rao;kaun banega crorepathi;marchఒక్కరోజు ప్రకటనలకు 3 కోట్లా...ఇది రికార్డు...?ఒక్కరోజు ప్రకటనలకు 3 కోట్లా...ఇది రికార్డు...?EVARU MEELO KOTEESWARULU SHOW UPDATE;chiranjeevi;ntr;amitabh bachchan;nagarjuna akkineni;jr ntr;nageshwara rao akkineni;yajamanya;india;geum;bollywood;tollywood;cinema;telugu;bigboss;television;husband;reality show;letter;success;nandamuri taraka rama rao;kaun banega crorepathi;marchTue, 30 Mar 2021 15:00:00 GMTటెలివిజన్ రంగంలో ఇప్పటివరకు ఎన్నో రియాలిటీ షో లు గేమ్ షో లు వచ్చాయి. వీటిలో కొన్ని ప్రజల అభిమానాలాలను పొంది సక్సెస్ అయ్యాయి. మరి కొన్ని ప్రజల అంచనాలను అందుకోవడంలో నిరాశ పరిచాయి. వీటిలో ముఖ్యంగా మన భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే గేమ్ షో కి వచ్చినంత ఆదరణ ఏ షో కు రాలేదనే చెప్పాలి. ఈ షో కు వ్యాఖ్యాతగా మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యవహరించారు. ఆ తరువాత కొద్ది కాలం క్రిందట ఇదే షోను మన తెలుగులోకి అనువదించారు. మా టీవీ వారు ఈ షోను "మీలో ఎవరు కోటీశ్వరుడు" అనే పేరుతో ప్రసారం చేశారు. దీనికి వ్యాఖ్యాతగా టాలీవుడ్ మన్మధుడుగా పేరున్న అక్కినేని నాగార్జున చేశాడు. కేవలం ఒక సీజన్ లో మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా చేశారు.

ఇక్కడ మన తెలుగులో కూడా ఈ షో కు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన కొంత కాలం వరకు ఈ షోకు బ్రేకు పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ షోను టైటిల్ మార్చి మన ముందుకు తీసుకువస్తున్నారు జెమినీ టీవీ యాజమాన్యం. ఇక్కడ "మీలో ఎవరు కోటీశ్వరుడు" ను కొద్దిగా మార్చి "ఎవరు  మీలో కోటీశ్వరులు" గా చేస్తున్నారు. అయితే ఈ షోకు వ్యాఖ్యాతగా ఈ సారి నాగార్జున కానీ...చిరంజీవి కానీ రావడం లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ షో కి వ్యాఖ్యాతగా చేయనున్నారు. దీనితో ఈ షో పై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి.

ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ కి చేసే సమయంలో కేవలం ఎన్టీఆర్ కోసమే ఎంతో మంది శని మరియు ఆదివారాలు కోసం వెయిట్ చేసేవారు. అయితే ఏ షో అయినా సినిమా అయినా సీరియల్ అయినా ప్రజల్లోకి వెళ్లాలంటే...ప్రచారం ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రస్తుతం ఈ షో కి కూడా ప్రచారాలను ఒక రేంజు లో చేస్తున్నారు. అన్ని వార్తా పత్రికల్లో మరియు టీవీ లలోనే ప్రకటనలు భారీగా  ఇచ్చారు. దీనితో ఈ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ప్రేక్షకుడి మనసులోకి ఈ విషయం వెళ్ళింది. ఇలా ఈ ఒక్క రోజు ప్రకటనలకు వీరు ఖర్చు పెట్టిన మొత్తం అక్షరాలా 3 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది రికార్డు గా ఉంది. మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి ప్రజల ముందుకు తీసుకు పోవడానికి జెమినీ టీవీ యాజమాన్యం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. ఈ షో సక్సెస్ భారమంతా కూడా  ఎన్టీఆర్ పైనే ఉంది. మరి ఈ షో సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.





సిసింద్రీ సినిమా గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

వావ్ .... ఆర్ఆర్ఆర్ నుండి మరొక పెద్ద అప్ డేట్ వచ్చేసిందిగా .... ??

తగ్గేది లేదు ... అనుకున్న టైం కె వస్తున్నా .... కాచుకోండి ..... ??

చిరంజీవి నటించిన మరణ మృదంగం సినిమా సమయంలో ఎవరు ఊహించని సంఘటన

ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్

మొత్తానికి మిగతావాళ్ళకి పెద్ద టార్గెట్ సెట్ చేసిన పవర్ స్టార్ ..... ?? (వకీల్ సాబ్ ట్రైలర్)

నాగబాబుకి ఇష్టమైన యాంకర్ అమెనట ..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>