PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-ycp-jagan-tdp-babu-pawankalyan-latestnewsda1a911d-28d8-4271-88a5-3c64ce1dc9a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-ycp-jagan-tdp-babu-pawankalyan-latestnewsda1a911d-28d8-4271-88a5-3c64ce1dc9a7-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన తెలుగోడి గొంతు మూగబోయింది. నే పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనేరీతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ రాగం పాడుతుండటమే దీనికి కారణం. ప్రాంతాలతో, రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ధ్వనులు ప్రబలుతున్నాయి. నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజలు, మేధావులు, ఆర్థికరంగ నిపుణులు గర్హిస్తున్నారు. bjp, ycp, jagan, tdp, babu, pawankalyan, latestnews;raaga;narendra modi;rajya sabha;రాజీనామా;telugu;vishakapatnam;central government;venkaiah naiduవిశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వెన‌క వెంకయ్యనాయుడు??విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వెన‌క వెంకయ్యనాయుడు??bjp, ycp, jagan, tdp, babu, pawankalyan, latestnews;raaga;narendra modi;rajya sabha;రాజీనామా;telugu;vishakapatnam;central government;venkaiah naiduTue, 30 Mar 2021 12:15:33 GMTవిశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన తెలుగోడి గొంతు మూగబోయింది. నే పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనేరీతిలో కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ రాగం పాడుతుండటమే దీనికి కారణం. ప్రాంతాలతో, రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ధ్వనులు ప్రబలుతున్నాయి. నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రజలు, మేధావులు, ఆర్థికరంగ నిపుణులు గర్హిస్తున్నారు. తాజాగా విశాఖఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌లోకి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుణ్ని కూడా ప్ర‌మేయ‌ముందంటూ కొత్త‌రాగం తెర‌పైకి వ‌చ్చింది.

విశాఖ ఉక్కు నుంచి ఉప రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు
విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపన కోసం ఇందిరాగాంధీ హయాంలో సాగిన ఉద్యమం దేశచరిత్రలో ప్రత్యేకంగా లిఖితమైంది. ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాటి యువకుడు, నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ప్రయివేటీకరణ ఉచ్చులోకి లాగుతున్నారు. ఆ ఉద్య‌మం నుంచి ప్రారంభ‌మైన వెంక‌య్య‌నాయుడి రాజ‌కీయ ప్ర‌స్థానం ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి చేప‌ట్టేవ‌ర‌కు సాగింది. రాజ్యాంబ‌ద్ధ ప‌ద‌వుల్లో ఉన్న‌వారిని కూడా వ‌దిలిపెట్ట‌కుండా ఈ మ‌కిలీలు అంట‌గ‌ట్ట‌డంపై అన్నివైపుల నుంచి  విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నాటి ఉద్యమ సమయంలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించిన‌ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మౌనం వహించడం బాధాకరమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రికొంద‌రు ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉక్కు ఉద్యమంలో భాగం కావాలనే వాదనను తెరమీదికి తెస్తున్నారు. ఈ విషయంలో కొన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుండగా, మ‌రికొన్ని పార్టీలు మాత్రం వెంక‌య్య ఉద్య‌మం చేయాలంటూ ప్ర‌చారం చేస్తున్నాయి. ఒక ఉపరాష్ట్రపతిని ఉద్యమంలోకి లాగే ప్రయత్నం చేయడం ఎంత‌వ‌ర‌కు సమంజసమ‌నే వ్యాఖ్యలు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వ‌స్తున్నాయి.

రాజ‌కీయ నేత‌ల్లా కాకుండా...
ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా, రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వుల్లో ఉన్న‌వారికి ఒక విన‌తిప‌త్రం ఇవ్వ‌వ‌చ్చు. వారిద్వారా రాజ్యసభలో చర్చ జరిగేలా మన రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులపై ఒత్తిడి తేవచ్చు. తద్వారా కేంద్రానికి గట్టి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఉపరాష్ట్రపతి ప్ర‌మేయం ఉండ‌దు. ఈ విష‌యాల‌న్నీ తెలిసి వ్యాఖ్యానిస్తున్నారా?  తెలియకుండా వ్యాఖ్యానిస్తున్నారా? అనేది ఉద్యమ నాయకుల వైఖ‌రికే వ‌దిలేయాలి. ఉద్య‌మ నేత‌లు రాజ‌కీయ నేత‌ల్లా కాకుండా ఉద్య‌మంపై పూర్తిస్థాయి దృష్టిసారించాల‌ని కార్మికులు, ఉద్యోగులు, తెలుగువారంతా కోరుతున్నారు.




వకీల్ సాబ్ ట్రైలర్ పై నెగెటివ్ టాక్ కి కారణం ఎవరు..?

ఏయన్నార్ తో నటించను అని చెప్పిన నాగ్...?

రామ్ చరణ్ వాచ్, టీషర్ట్ ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

మహేష్ తో సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న గురూజీ...

ముహూర్త బ‌లాన్ని న‌మ్ముకున్న వైసీపీ ? ఇదో వింత‌

తిరుప‌తిలో వైసీపీ ఫ‌స్ట్ స్టెప్‌తోనే టీడీపీ బెంబేలు..!‌

టాలీవుడ్ గాస్సిప్స్: పవన్ కళ్యాణ్ తో నటించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పిన రాజీవ్ కనకాల..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>