Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/crickete630d765-8f87-4f61-905b-6fd6afefec38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/crickete630d765-8f87-4f61-905b-6fd6afefec38-415x250-IndiaHerald.jpg క్రికెట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం కొంత టార్గెట్‌ను నిర్ణయిస్తుంది. ఆ టార్గెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఛేజింగ్ టీం బరిలోకి దిగుతుంది. అయితే ఎప్పుడైనా ఛేజింగ్ టీం టార్గెట్ ఎంతో తెలియకుండానే బరిలోకి దిగడం ఎప్పుడైనా చూశారా..? విచిత్రంగా అనిపించినా.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఛేజింగ్‌కు దిగిన జట్టు టార్గెట్..cricket;varsha;bangladesh;icc t20;paruguటార్గెట్ తెలుసుకోకుండానే ఛేజింగ్‌కు.. చివరికి అంపైర్లు అవాక్!టార్గెట్ తెలుసుకోకుండానే ఛేజింగ్‌కు.. చివరికి అంపైర్లు అవాక్!cricket;varsha;bangladesh;icc t20;paruguTue, 30 Mar 2021 22:14:35 GMTఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం కొంత టార్గెట్‌ను నిర్ణయిస్తుంది. ఆ టార్గెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఛేజింగ్ టీం బరిలోకి దిగుతుంది. అయితే ఎప్పుడైనా ఛేజింగ్ టీం టార్గెట్ ఎంతో తెలియకుండానే బరిలోకి దిగడం ఎప్పుడైనా చూశారా..? విచిత్రంగా అనిపించినా.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఛేజింగ్‌కు దిగిన జట్టు టార్గెట్ ఎంతో కూడా తెలియకండా బ్యాటింగ్ ప్రారంభించేసింది. అయితే కొద్ది సేపటికి విషయం బయటపడడంతో అంపైర్లు మ్యాచ్ ఆపేసి లెక్కలన్నీ వేసి టార్గెట్ సెట్ చేశారు.

సోమవారం న్యూజిల్యాండ్‌-బంగ్లాదేశ్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. 3 టీ20ల సిరీస్‌లో భాగంగా నేపియర్‌లో రెండో టీ20 జరిగింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ వర్షం కారణంగా 17.5 ఓవర్లకే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అప్పటికి కివీస్ స్కోరు 5 వికెట్లకు 173. అయితే బంగ్లాదేశ్ ఛేజింగ్‌కు దిగే సమయానికి మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. అయితే టార్గెట్ ఎంతనేది ప్రకటించలేదు. టార్గెట్ తెలుసుకోకుండా బంగ్లాదేశ్ ఛేజింగ్ మొదలుపెట్టేసింది. అయితే ఒకటిన్నర ఓవర్ ముగిశాక టార్గెట్ ఎంతో తెలియకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. మ్యాచ్‌ను 5 నిముషాలపాటు నిలిపిన అంపైర్లు.. టార్గెట్‌పై థర్డ్ అంపైర్ నుంచి అధికారిక ప్రకటన తీసుకుని తిరిగి ప్రారంభించారు.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ కోచ్ రస్సెల్ డోమింగో స్పందించారు. టార్గెట్ విషయంలో అధికారుల వల్ల కొంత అయోమయం ఏర్పడిందని, టార్గెట్‌ను అధికారికంగా ప్రకటించకపోవడమే దీనికి కారణమని చెప్పారు. ‘న్యూజిల్యాండ్ జట్టు 20 ఓవర్లలో  173 పరుగులు చేసి ఉంటే 16 ఓవర్లలో మా టార్గెట్ 148గా ఉండేది. అయితే ప్రత్యర్థి జట్టు పూర్తి ఓవర్లు బ్యాటింగ్ చేయలేదు. కానీ టార్గెట్‌ను 20 ఓవర్లకు బ్యాటింగ్ చేసినట్లు లెక్కించుకున్నాం. దానివల్లే సమస్య తలెత్తింది. అయితే మ్యాచ్ మొదలైన తరువాత విషయం అర్థం కావడంతో మ్యాచ్ రిఫరీ కొద్ది సేపు లెక్కించి 16 ఓవర్లలో టార్గెట్‌ను 171 సెట్ చేశార’ని తెలిపారు.

ఇదిలా ఉంటే 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 16 ఓవర్లు మొత్తం బ్యాటింగ్ చేసి 7 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో డీఎల్ఎస్(డక్‌వర్త్ లూయిస్) పద్ధతిలో 28 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. ఇదిలా ఉంటే అంతకుముందు తొలి టీ20లో కూడా కివీస్ విజయం సాధించింది. మూడో టీ20 గురువారం జరగనుంది.


త్రివిక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడా..?

పాపం బండ్ల గణేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా.. ఈసారి వచ్చి రాని ఇంగ్లీష్ తో..??

ఆమె కేంద్ర మంత్రి...ఈయన ముఖ్యమంత్రి... జనాల సంగతేంటి...

సాగర్ లో బీజేపీ క్లీన్ బౌల్డేనా?

బీబీ 3 టైటిల్ ఆ భాషలో...?

పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'వకీల్ సాబ్' రిలీజ్ కి బ్రేక్..??

పొట్టి దుస్తులతో అనసూయ హోళీ సంబరాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>