PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/words-war-in-tirupati-by-poll-campaigne1a8f263-02fc-44be-aa24-10375c8401db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/words-war-in-tirupati-by-poll-campaigne1a8f263-02fc-44be-aa24-10375c8401db-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికల్లో మాటల యుద్ధం ముదురుతోంది. పనబాక లక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వైసీపీ ఎంపీలంతా గొర్రెలని, టీడీపీ ఎంపీలు సింహాలని ఆయన పోలిక చెప్పారు. మూడు సింహాలకు తోడు మరో సింహాన్ని గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీ తరపున పార్లమెంట్ లో పోరాడుతోంది టీడీపీ సింహాలేనని అన్నారు అచ్చెన్నాయుడు. ఆయన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో టీడీపీ సింహాలు గతంలో గోళ్లు గిల్లtirupati, tirupati by poll, words war;lakshmi;tiru;bharatiya janata party;korcha;jagan;kakani govardhan reddy;andhra pradesh;nellore;tirupati;parliment;mla;war;husband;tdp;ycp;reddy;panabaka lakshmiతిరుపతిలో ముదురుతున్న మాటల యుద్ధం..తిరుపతిలో ముదురుతున్న మాటల యుద్ధం..tirupati, tirupati by poll, words war;lakshmi;tiru;bharatiya janata party;korcha;jagan;kakani govardhan reddy;andhra pradesh;nellore;tirupati;parliment;mla;war;husband;tdp;ycp;reddy;panabaka lakshmiTue, 30 Mar 2021 08:00:00 GMTతిరుపతి ఉప ఎన్నికల్లో మాటల యుద్ధం ముదురుతోంది. పనబాక లక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వైసీపీ ఎంపీలంతా గొర్రెలని, టీడీపీ ఎంపీలు సింహాలని ఆయన పోలిక చెప్పారు. మూడు సింహాలకు తోడు మరో సింహాన్ని గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీ తరపున పార్లమెంట్ లో పోరాడుతోంది టీడీపీ సింహాలేనని అన్నారు అచ్చెన్నాయుడు. ఆయన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో టీడీపీ సింహాలు గతంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాయా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం పోరాడటం మానేసి, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల దమ్ము, ధైర్యం ఏంటో.. తిరుపతి ఉప ఎన్నికల్లో చూపిస్తామన్నారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, సంస్కారవంతంగా మాట్లాడాలని కోరారు.

అటు బీజేపీ కూడా ఈ మాటల యుద్ధంలోకి ఎంటరైంది. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. వైసీపీ ఎంపీలను తోలుబొమ్మలంటూ ఎద్దేవా చేశారు. నామినేషన్ అనంతరం నెల్లూరులో బీజేపీ నేతలు బలప్రదర్శనగా ర్యాలీలో పాల్గొన్నారు. రత్నప్రభకు మద్దతుగా కీలక నేతలంతా తరలి వచ్చారు. అదే సమయంలో రత్నప్రభ కూడా రాజకీయ వ్యాఖ్యలతో కలకలం రేపారు. వైసీపీ ఎంపీలు ఎంతమంది ఉన్నా.. వారి మాట పార్లమెంట్ లో వినపడదని, వారంతా జగన్ చేతిలో తోలుబొమ్మలని ఎద్దేవా చేశారు. బీజేపీ తరపున ఎంపీగా తనను పార్లమెంట్ కి పంపిస్తే.. తిరుపతి అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు.

తిరుపతి ఉప ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఇక్కడ విశేషం. 4లక్షల మెజార్టీ వస్తే.. జగన్ పాలనకు ప్రజామోదం ఉందనే విషయం మరోసారి గట్టిగా రూఢీ చేసినట్టు అవుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అదే సమయంలో వైసీపీ మెజార్టీని వీలైనంత తగ్గిస్తే.. టీడీపీ శ్రేణులు మానసికంగా బలపడతాయని అంచనా వేస్తున్నారు చంద్రబాబు. అందుకే ఆయన తిరుపతిపై ఫోకస్ పెంచారు. ఇటు బీజేపీకి కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీకి తాము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ.. తిరుపతిలో సత్తా చూపితేనే.. ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం పెరుగుతుంది. అందుకే జనసేనతో కలిపి కనీసం రెండో స్థానం అయినా దక్కించుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. 21మంది వైసీపీ ఎంపీలకు మరొకర్ని జతచేయాలా, లేదా ముగ్గురు టీడీపీ ఎంపీల బలాన్ని నాలుగుకి పెంచాలా.. ఈ రెండూ కాకుండా.. ఏపీ తరపున లోక్ సభలో బీజేపీకి లేని ప్రాతినిధ్యాన్ని తిరుపతితో అందించాలా అనేది ఓటర్లు డిసైడ్ చేసుకోవాల్సి ఉంది.


నిర్మలమ్మకు మోడీ ఆ శాఖ ఇస్తారా...?

చంద్ర‌బాబు.. గుర్తులు చెరుగుతున్నాయ్‌‌.. కాదు జ‌గ‌న్ చెరిపేశారు..!

ఈ సారి ఐపీఎల్‌లో కొత్త రూల్స్ పక్కా.. టోర్నీ రూపమే మారబోతోందా..!

నాగార్జున సాగ‌ర్‌లో బీజేపీ సామాజిక కోణం ప‌నిచేస్తుందా...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను మునగచెట్టు ఎక్కించేస్తున్నారా ?

రాజమౌళి సినిమాలో చరణ్.. తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అన్నా రాంబాబుకు పవన్ చెక్ పెడతారా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>